Evvaridodi godava limka nelaa

ఎవ్వరితోడి గొడవ లిఁక నేలా
Language

(॥పల్లవి॥)
ఎవ్వరితోడి గొడవ లిఁక నేలా
యివ్వల మ మ్మిందులోనే యేల పొగడేవు

(॥ఎవ్వరి॥)
సన్నల సారెకు మెచ్చ సణఁగు నీపైఁ జల్ల
కన్నులెదుట నీ కాపె గలిగెఁగా
మన్ననలు పచరించ మాటికి మాటికి నవ్వ
అన్నిటిమారును నీవు ఆపెకుఁ గలితి గా

(॥ఎవ్వరి॥)
యిచ్చకము నీకు నాడ యే మైనఁ బనులు సేయ
గచ్చుల నీకు నేఁ డాపె గలిగెఁ గా
చెచ్చెర వాసు లెక్కించ చెప్పినపనులు సేయ
నిచ్చ నిచ్చ నాపెకు నీవు గలితివి గా

(॥ఎవ్వరి॥)
అంది నీకాఁగిఁట గూడ నాయము గరఁగి చొక్క
కందువ లంట నీ కాపె గలిగెఁ గా
అందపు శ్రీవెంకటేశ ఆపెఁ గూడి నన్నుఁ గూడి
తిందులో మాయిద్దరికి నిటు గలితివిగా

(||pallavi||)
ĕvvaridoḍi gŏḍava lim̐ka nelā
yivvala ma mmiṁdulone yela pŏgaḍevu

(||ĕvvari||)
sannala sārĕgu mĕchcha saṇam̐gu nībaim̐ jalla
kannulĕduḍa nī kābĕ galigĕm̐gā
mannanalu pasariṁcha māḍigi māḍigi navva
anniḍimārunu nīvu ābĕgum̐ galidi gā

(||ĕvvari||)
yichchagamu nīgu nāḍa ye mainam̐ banulu seya
gachchula nīgu nem̐ ḍābĕ galigĕm̐ gā
sĕchchĕra vāsu lĕkkiṁcha sĕppinabanulu seya
nichcha nichcha nābĕgu nīvu galidivi gā

(||ĕvvari||)
aṁdi nīgām̐gim̐ṭa gūḍa nāyamu garam̐gi sŏkka
kaṁduva laṁṭa nī kābĕ galigĕm̐ gā
aṁdabu śhrīvĕṁkaḍeśha ābĕm̐ gūḍi nannum̐ gūḍi
tiṁdulo māyiddarigi niḍu galidivigā