Evvarido godavela yidumalam badanela

ఎవ్వరితో గొడవేల యిడుమలఁ బడనేల
Language

(॥పల్లవి॥)
ఎవ్వరితో గొడవేల యిడుమలఁ బడనేల
రవ్వగా నీ సతిఁగూడి రాజ్యమేలవయ్యా

(॥ఎవ్వ॥)
నిండునిదా(ధా?) నమువంటినెలంత యెదుటనదె
కొండలవంటి గొప్పకుచము లవె
వెండీఁబైఁడి వంటివేడుక ప్రియము లవె
వుండవయ్య యీకెవద్ద నొక్క మనసునను

(॥ఎవ్వ॥)
వసంత కాలమువంటి వాలినజవ్వన మదె
ముసరుఁదేనె వంటిమోవి యదె
పసనిముత్తేలవంటి పైపైసిగ్గులు నవె
రసికుండ విన్నిటాను రమియించవయ్యా

(॥ఎవ్వ॥)
చవులవిందువంటిసరసపుమాఁట లవె
కవగూడేయటువంటి కాఁగిళ్లవె
యివల శ్రీవేంకటేశ యిద్దరూ నెనసితిరి
పవళించి యిట్లానే పాయకుండవయ్యా

(||pallavi||)
ĕvvarido gŏḍavela yiḍumalam̐ baḍanela
ravvagā nī sadim̐gūḍi rājyamelavayyā

(||ĕvva||)
niṁḍunidā(dhā?) namuvaṁṭinĕlaṁta yĕduḍanadĕ
kŏṁḍalavaṁṭi gŏppagusamu lavĕ
vĕṁḍīm̐baim̐ḍi vaṁṭiveḍuga priyamu lavĕ
vuṁḍavayya yīgĕvadda nŏkka manasunanu

(||ĕvva||)
vasaṁta kālamuvaṁṭi vālinajavvana madĕ
musarum̐denĕ vaṁṭimovi yadĕ
pasanimuttelavaṁṭi paibaisiggulu navĕ
rasiguṁḍa vinniḍānu ramiyiṁchavayyā

(||ĕvva||)
savulaviṁduvaṁṭisarasabumām̐ṭa lavĕ
kavagūḍeyaḍuvaṁṭi kām̐giḽlavĕ
yivala śhrīveṁkaḍeśha yiddarū nĕnasidiri
pavaḽiṁchi yiṭlāne pāyaguṁḍavayyā