ఎవ్వరితో గొడ వేల యింకా నీకు
(॥పల్లవి॥)
ఎవ్వరితో గొడ వేల యింకా నీకు
రవ్వగా నీయింటికి రమ్మనేవు నీవూ
(॥ఎవ్వరితో॥)
యీయింతిపయి మన్నన నీ కేఁటిదో వొక్కమాఁటలో
సేయరానిపను లైన సేతువు నీవు
మాయ సేసి యాపె నీతో మచ్చిక చల్లితేఁ జాలు
పాయ లేక నిలువున భ్రమతువు నీవూ
(॥ఎవ్వరితో॥)
యెవ్వ రైనా నాపెను నేఁ డిటు పేరుకొంటేఁ జాలు
అవ్వల మూపులు మూఁడు అవుదువు నీవు
నవ్వులకు నాపెపయి నానలు వెట్టితేఁ జాలు
నివ్వెరగుపడి అట్టె నిలుతువు నీవూ
(॥ఎవ్వరితో॥)
యెంతదడ వాపె నీయెదుట నుండితేఁ జాలు
రంతులఁ గిందు మీఁదు నరయవు నీవూ
కాంతతో శ్రీవెంకటేశ కడపలోఁ దే రెక్కి
యింత నన్నుఁ గూడి వీదు లేఁగితివి నీవూ
(||pallavi||)
ĕvvarido gŏḍa vela yiṁkā nīgu
ravvagā nīyiṁṭigi rammanevu nīvū
(||ĕvvarido||)
yīyiṁtibayi mannana nī kem̐ṭido vŏkkamām̐ṭalo
seyarānibanu laina seduvu nīvu
māya sesi yābĕ nīdo machchiga sallidem̐ jālu
pāya lega niluvuna bhramaduvu nīvū
(||ĕvvarido||)
yĕvva rainā nābĕnu nem̐ ḍiḍu perugŏṁṭem̐ jālu
avvala mūbulu mūm̐ḍu avuduvu nīvu
navvulagu nābĕbayi nānalu vĕṭṭidem̐ jālu
nivvĕragubaḍi aṭṭĕ niluduvu nīvū
(||ĕvvarido||)
yĕṁtadaḍa vābĕ nīyĕduḍa nuṁḍidem̐ jālu
raṁtulam̐ giṁdu mīm̐du narayavu nīvū
kāṁtado śhrīvĕṁkaḍeśha kaḍabalom̐ de rĕkki
yiṁta nannum̐ gūḍi vīdu lem̐gidivi nīvū