Evvaridi nerubo yee imti neelonanu

ఎవ్వరిది నేరుపో యీ ఇంతి నీలోనను
Language

(॥పల్లవి॥)
ఎవ్వరిది నేరుపో యీ ఇంతి నీలోనను
జవ్వనపు మదము సాదించె నిన్నును

(॥ఎవ్వ॥)
నిక్కినిక్కి చూపులనె నీమనసు గరఁగించె
చక్కెరమోవి చూపి చల్లె వలపు
చొక్కు నొక్కి బుజ్జగించి సిగ్గులు దేరిచె నీపె
పక్కన రేపల్లలోనబాలుఁడై ననిన్నును

(॥ఎవ్వ॥)
సెలవుల నవ్వులనేచెమటలు వుట్టించె
పొలసి ఇచ్చకముఁ బులకింపించె
నెలకొన విడెమిచ్చి నిందురతులకుఁ దీసె
బలిమి యశోదయింట బాలుఁడై ననిన్నును

(॥ఎవ్వ॥)
మంతనానకుఁ బిలిచి మరిగించె నిన్ను నిట్టె
పంతపుఁ జేఁతలనే పచ్చి సేసెను
యింతలో శ్రీవేంకటేశ యెనసె నలమేల్మంగ
బంతినే ఆవులఁ గాచేబాలుఁడైననిన్నును

(||pallavi||)
ĕvvaridi nerubo yī iṁti nīlonanu
javvanabu madamu sādiṁchĕ ninnunu

(||ĕvva||)
nikkinikki sūbulanĕ nīmanasu garam̐giṁchĕ
sakkĕramovi sūbi sallĕ valabu
sŏkku nŏkki bujjagiṁchi siggulu derisĕ nībĕ
pakkana reballalonabālum̐ḍai naninnunu

(||ĕvva||)
sĕlavula navvulanesĕmaḍalu vuṭṭiṁchĕ
pŏlasi ichchagamum̐ bulagiṁpiṁchĕ
nĕlagŏna viḍĕmichchi niṁduradulagum̐ dīsĕ
balimi yaśhodayiṁṭa bālum̐ḍai naninnunu

(||ĕvva||)
maṁtanānagum̐ bilisi marigiṁchĕ ninnu niṭṭĕ
paṁtabum̐ jem̐talane pachchi sesĕnu
yiṁtalo śhrīveṁkaḍeśha yĕnasĕ nalamelmaṁga
baṁtine āvulam̐ gāsebālum̐ḍainaninnunu