ఎవ్వరిది నేర్పు మన యిద్దరిలోనా
(॥పల్లవి॥)
ఎవ్వరిది నేర్పు మన యిద్దరిలోనా
జవ్వను లిందరుఁ జూచి సంతోసించేరు
(॥॥)
వొడిలోని నిమ్మపండు వొగిఁ జేతఁ దియ్యఁగానే
పిడికిటఁ బట్టి యట్టె పెనఁగేవు
తొడిఁ బడ నంతలోనే దొడ్డకుచ్చెల వీడితే
కడఁగి నీపచ్చడము గప్పుకొనవలదా
(॥॥)
పయ్యెదలోని విడెము పట్టి నీకియ్యరాఁగానే
కొయ్యవై పొదిగి పట్టి గుంపించితివి
చయ్యన బయలుగాఁగా చన్నులకు నీకుళ్ళాయి
వొయ్యనే మాటుగా నొనర్చుకోవలదా
(॥॥)
కొప్పుపూవు బంతి దీసుకొని కానుకియ్యరాఁగా
అప్పళించి నీకాఁగిట నలమితివి
యిప్పుడే శ్రీ వేంకటేశ యింతలో సిగ్గు విడఁగా
విప్పుచు గక్కనఁ దెరవేసుకోవలదా
(||pallavi||)
ĕvvaridi nerbu mana yiddarilonā
javvanu liṁdarum̐ jūsi saṁtosiṁcheru
(||||)
vŏḍiloni nimmabaṁḍu vŏgim̐ jedam̐ diyyam̐gāne
piḍigiḍam̐ baṭṭi yaṭṭĕ pĕnam̐gevu
tŏḍim̐ baḍa naṁtalone dŏḍḍaguchchĕla vīḍide
kaḍam̐gi nībachchaḍamu gappugŏnavaladā
(||||)
payyĕdaloni viḍĕmu paṭṭi nīgiyyarām̐gāne
kŏyyavai pŏdigi paṭṭi guṁpiṁchidivi
sayyana bayalugām̐gā sannulagu nīguḽḽāyi
vŏyyane māḍugā nŏnarsugovaladā
(||||)
kŏppubūvu baṁti dīsugŏni kānugiyyarām̐gā
appaḽiṁchi nīgām̐giḍa nalamidivi
yippuḍe śhrī veṁkaḍeśha yiṁtalo siggu viḍam̐gā
vippusu gakkanam̐ dĕravesugovaladā