Evvari voodigamulu yela neegu

ఎవ్వరి వూడిగములు యేల నీకు
Language

(॥పల్లవి॥)
ఎవ్వరి వూడిగములు యేల నీకు
వువ్విళ్ళూర నాపె తోడ నోలలాడరాదా

(॥ఎవ్వ॥)
చెక్కులనిండాఁ గారు చెమటలతోడనే
వెక్కసముగా నీకు వీడెమిచ్చీని
ముక్కున నూరుపులెల్లా ముంచఁగానే నీకు
అక్కరపడి విసరీ నది గదవయ్యా

(॥ఎవ్వ॥)
జల్లన విరులురాల జారిన తురుముతోనే
తెల్లమిగా నీనెరులు తిద్దీ నదివో
వల్లెవాటు వేసుకొన్న వదలుఁబయ్యదతోడ
చల్లువెద నీసరులు చక్కఁబెట్టీని

(॥ఎవ్వ॥)
బలిమి నీసమరతి బడలికతోడనే
లలిమీరి యిట్టే నీయలపు దీర్చీని
కలసి శ్రీవేంకటేశ కడుఁ బులకలతోనే
చలపట్టి నిన్ను జంటలు సేసీని

(||pallavi||)
ĕvvari vūḍigamulu yela nīgu
vuvviḽḽūra nābĕ toḍa nolalāḍarādā

(||ĕvva||)
sĕkkulaniṁḍām̐ gāru sĕmaḍaladoḍane
vĕkkasamugā nīgu vīḍĕmichchīni
mukkuna nūrubulĕllā muṁcham̐gāne nīgu
akkarabaḍi visarī nadi gadavayyā

(||ĕvva||)
jallana virulurāla jārina turumudone
tĕllamigā nīnĕrulu tiddī nadivo
vallĕvāḍu vesugŏnna vadalum̐bayyadadoḍa
salluvĕda nīsarulu sakkam̐bĕṭṭīni

(||ĕvva||)
balimi nīsamaradi baḍaligadoḍane
lalimīri yiṭṭe nīyalabu dīrsīni
kalasi śhrīveṁkaḍeśha kaḍum̐ bulagaladone
salabaṭṭi ninnu jaṁṭalu sesīni