ఎవ్వరి వసము గాఁడు యెత్తినవారి చే బిడ్డఁడు
(॥పల్లవి॥)
ఎవ్వరి వసము గాఁడు యెత్తినవారి చే బిడ్డఁడు
నొవ్వక నోకి కన్న నీ నోముఫల మిదివో
(॥ఎవ్వ॥)
వేగి లేచితే సుద్దులు వెన్నలు దొంగిలీ నవె
బాగై నీరాటే(డేఁ) రేవు పచ్చి సిగ్గులే
చేగదేరె బండె డేసి చేఁతలు ముంగిటనే
యీగతి బిడ్డఁడు వుట్టె నెశోద నీకమ్మా
(॥ఎవ్వ॥)
పొద్దుఁగూకితే కన్నవి పొంచి చీఁకటి తప్పులే
మద్దులు విరిచీ నవి మంద బయట
పొద్దు మరిఁ బొడిచితే(తేఁ) బూతకి చంటికతలే
యెద్దువంటి బీరాలవాఁ డెంతసేసీ నమ్మా
(॥ఎవ్వ॥)
నిచ్చ నిచ్చ వేసేవి నిండు గొల్లముంజులే
రచ్చ కెక్కినది గోవర్ధన మహిమ
ఇచ్చల శ్రీ వేంకటాద్రి నిరవాయ నీక్రిష్ణుఁడు
యిచ్చకాఁడు నేఁ డితని కెదురేడదమ్మా
(||pallavi||)
ĕvvari vasamu gām̐ḍu yĕttinavāri se biḍḍam̐ḍu
nŏvvaga nogi kanna nī nomuphala midivo
(||ĕvva||)
vegi leside suddulu vĕnnalu dŏṁgilī navĕ
bāgai nīrāḍe(ḍem̐) revu pachchi siggule
segaderĕ baṁḍĕ ḍesi sem̐talu muṁgiḍane
yīgadi biḍḍam̐ḍu vuṭṭĕ nĕśhoda nīgammā
(||ĕvva||)
pŏddum̐gūgide kannavi pŏṁchi sīm̐kaḍi tappule
maddulu virisī navi maṁda bayaḍa
pŏddu marim̐ bŏḍiside(tem̐) būdagi saṁṭigadale
yĕdduvaṁṭi bīrālavām̐ ḍĕṁtasesī nammā
(||ĕvva||)
nichcha nichcha vesevi niṁḍu gŏllamuṁjule
rachcha kĕkkinadi govardhana mahima
ichchala śhrī veṁkaḍādri niravāya nīkriṣhṇum̐ḍu
yichchagām̐ḍu nem̐ ḍidani kĕdureḍadammā