Evvari suddulu neegu nemidigi

ఎవ్వరి సుద్దులు నీకు నేమిటికి
Language

(॥పల్లవి॥)
ఎవ్వరి సుద్దులు నీకు నేమిటికి
నవ్వులు నీలోలోనే నారుకొన్నవి

(॥ఎవ్వ॥)
అట్టె యాపె విన్నవిన్నవించినవి యెల్ల నీచెవులఁ
బట్టి నీమనసులోనఁ బాయకున్నవి
నెట్టిన యేకతవేళ నేరిపిన నేరుపులు
వొట్టుక నీ కన్నియును నుపదేశ మైనవి

(॥ఎవ్వ॥)
సొలసి యాపె చూచినచూపులు నీమర్మముల
నిలిచి సందుసందుల నిండుకున్నవి
చెలఁగి యావేళ నిన్ను చెనకినచెనకులు
మొలకకస్తూరి వ్రాఁతముద్రలై వున్నవి

(॥ఎవ్వ॥)
కోరి వేఁడి యాపె నిన్నుఁగూడినకూటములు
సారె సారె వలపులచవు లైనవి
యీరీతి శ్రీవేంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
సేరి ఆరతులే యిందు దిష్టమైనవి

(||pallavi||)
ĕvvari suddulu nīgu nemiḍigi
navvulu nīlolone nārugŏnnavi

(||ĕvva||)
aṭṭĕ yābĕ vinnavinnaviṁchinavi yĕlla nīsĕvulam̐
baṭṭi nīmanasulonam̐ bāyagunnavi
nĕṭṭina yegadaveḽa neribina nerubulu
vŏṭṭuga nī kanniyunu nubadeśha mainavi

(||ĕvva||)
sŏlasi yābĕ sūsinasūbulu nīmarmamula
nilisi saṁdusaṁdula niṁḍugunnavi
sĕlam̐gi yāveḽa ninnu sĕnaginasĕnagulu
mŏlagakastūri vrām̐tamudralai vunnavi

(||ĕvva||)
kori vem̐ḍi yābĕ ninnum̐gūḍinagūḍamulu
sārĕ sārĕ valabulasavu lainavi
yīrīdi śhrīveṁkaḍeśha yiṭṭĕ nannum̐ gūḍidivi
seri āradule yiṁdu diṣhṭamainavi