ఎవ్వరి సాకిరి నేమిటికి యిటు
(॥పల్లవి॥)
ఎవ్వరి సాకిరి నేమిటికి యిటు
నవ్వక చూచిన నమ్ముదుఁ బో
(॥ఎవ్వరి॥)
పయ్యదలోనివే భారపుగుబ్బలు
తియ్యవిలుతు దళ దిబ్బెములు
నెయ్యమిఁ దొడికినని కల్ల నిజము
లియ్యడ నిన్నియు నేర్పడుఁబో
(॥ఎవ్వరి॥)
ఱట్టడి విపు డాఱడి నా యారిది
పట్టరాని బలుపామిదివో
యిట్టే యితరము లెఱుఁగ ననుచు వా
కట్టక ముట్టినఁ గందమువో
(॥ఎవ్వరి॥)
శ్రీవేంకటపతి సిరుల నీవిముడి
చేవలనే వేసిన ముడి యా
యీవలఁ గూడుచు నెత్తితి నిఁక నా
భావములో నిజపట్టితిఁబో
(||pallavi||)
ĕvvari sāgiri nemiḍigi yiḍu
navvaga sūsina nammudum̐ bo
(||ĕvvari||)
payyadalonive bhārabugubbalu
tiyyaviludu daḽa dibbĕmulu
nĕyyamim̐ dŏḍiginani kalla nijamu
liyyaḍa ninniyu nerbaḍum̐bo
(||ĕvvari||)
ṟaṭṭaḍi vibu ḍāṟaḍi nā yāridi
paṭṭarāni balubāmidivo
yiṭṭe yidaramu lĕṟum̐ga nanusu vā
kaṭṭaga muṭṭinam̐ gaṁdamuvo
(||ĕvvari||)
śhrīveṁkaḍabadi sirula nīvimuḍi
sevalane vesina muḍi yā
yīvalam̐ gūḍusu nĕttidi nim̐ka nā
bhāvamulo nijabaṭṭidim̐bo