Evvari nerubu lemche mimdu lonanu

ఎవ్వరి నేరుపు లెంచే మిందు లోనను
Language

(॥పల్లవి॥)
ఎవ్వరి నేరుపు లెంచే మిందు లోనను
వువ్విళ్లూరి మీలో మీకు నొనగూడె వలపు

(॥॥)
చిమ్ముఁజూపులనుఁ జూచీ సిగ్గరిపెండ్లికూఁతురు
నిమ్మపంట వేసేవు నీవాపెను
తమ్మిమోములు వంచేరు దండనున్న పేరటాండ్లు
సమ్మతించి మీలో మీకు చలివాసె వలపు

(॥॥)
కుప్పళించీఁ జెమటలు కొత్త పెండ్లి కూఁతురు
నెప్పున మెయిసోఁకించేవు నీవాపెను
వొప్పుగ మోములు చూచే రూడిగపువారలు
చెప్పరాక మీలో మీకు చిమ్మిరేఁగె వలపు

(॥॥)
మొక్కీ నలమేలుమంగ ముద్దుల పెండ్లి కూఁతురు
నెక్కోని కాఁగిలించేవు నీవాపెను
చొక్కపు శ్రీవేంకటేశ చుట్టాలెల్లా మెచ్చేరు
వుక్కుమీరి మీలో మీకు నుమ్మగిలీ వలపు

(||pallavi||)
ĕvvari nerubu lĕṁche miṁdu lonanu
vuvviḽlūri mīlo mīgu nŏnagūḍĕ valabu

(||||)
simmum̐jūbulanum̐ jūsī siggaribĕṁḍligūm̐turu
nimmabaṁṭa vesevu nīvābĕnu
tammimomulu vaṁcheru daṁḍanunna peraḍāṁḍlu
sammadiṁchi mīlo mīgu salivāsĕ valabu

(||||)
kuppaḽiṁchīm̐ jĕmaḍalu kŏtta pĕṁḍli kūm̐turu
nĕppuna mĕyisom̐kiṁchevu nīvābĕnu
vŏppuga momulu sūse rūḍigabuvāralu
sĕpparāga mīlo mīgu simmirem̐gĕ valabu

(||||)
mŏkkī nalamelumaṁga muddula pĕṁḍli kūm̐turu
nĕkkoni kām̐giliṁchevu nīvābĕnu
sŏkkabu śhrīveṁkaḍeśha suṭṭālĕllā mĕchcheru
vukkumīri mīlo mīgu nummagilī valabu