Evvari nemanavachchu yeggulettu patteve

ఎవ్వరి నేమనవచ్చు యెగ్గులెట్టు పట్టేవే
Language

(॥పల్లవి॥)
ఎవ్వరి నేమనవచ్చు యెగ్గులెట్టు పట్టేవే
జవ్వని వీనివల్లనే చలివాసె వలపు

(॥ఎవ్వ॥)
తెగువతో రమణునిఁ దిట్టఁగానే కదవె
చిగురు నీ మోవెల్లాఁ జిల్లులాయను
పగటున దట్టికొంగు పట్టఁగానే కదవె
నిగుడి చన్నులమీఁద నెలవంకలాయను

(॥ఎవ్వ॥)
సారెసారెకు నితని జంకించఁగాఁ గదవె
భారపుఁదురుము చిక్కువడె నిదె
నారుకొన్న సెలవుల నవ్వఁగానే కదవె
తారితారి పయ్యదెల్లాఁ దడిసెఁ జెమటల

(॥ఎవ్వ॥)
శ్రీ వేంకటేశ్వరునిఁ జెనకఁగానే కదవె
మూవంకలా నీపోఁకముడి వీడెను
వేవేలురతులఁ గూడి వెలయఁగాఁ గదవె
కై వసమై మొగమునఁ గళలెల్లా నిండెను

(||pallavi||)
ĕvvari nemanavachchu yĕggulĕṭṭu paṭṭeve
javvani vīnivallane salivāsĕ valabu

(||ĕvva||)
tĕguvado ramaṇunim̐ diṭṭam̐gāne kadavĕ
siguru nī movĕllām̐ jillulāyanu
pagaḍuna daṭṭigŏṁgu paṭṭam̐gāne kadavĕ
niguḍi sannulamīm̐da nĕlavaṁkalāyanu

(||ĕvva||)
sārĕsārĕgu nidani jaṁkiṁcham̐gām̐ gadavĕ
bhārabum̐durumu sikkuvaḍĕ nidĕ
nārugŏnna sĕlavula navvam̐gāne kadavĕ
tāridāri payyadĕllām̐ daḍisĕm̐ jĕmaḍala

(||ĕvva||)
śhrī veṁkaḍeśhvarunim̐ jĕnagam̐gāne kadavĕ
mūvaṁkalā nībom̐kamuḍi vīḍĕnu
veveluradulam̐ gūḍi vĕlayam̐gām̐ gadavĕ
kai vasamai mŏgamunam̐ gaḽalĕllā niṁḍĕnu