ఎవ్వరి నేమనఁగల మిప్పుడు నేము
(॥పల్లవి॥)
ఎవ్వరి నేమనఁగల మిప్పుడు నేము
నివ్వటిల్ల మిమ్ముఁ జూచి నవ్వే మింతేకాక
(॥ఎవ్వ॥)
నేరుపులన్నియుఁ జూపి నెలఁతపయ్యదకొంగు
సారెఁ దీసి యిట్టె సరసములాడేవు
ఆరితేరి నిన్ను నాపె అనవెట్టి పలుమారు
దూరుతాను పెంజెమట గోరఁ జిమ్మీని
(॥ఎవ్వ॥)
వేడుకలు వుట్టించి వెలఁదిచన్నులమీఁద
తోడనే కుంకుమ వూసి దొమ్మిసేసేవు
వీడినతురుముతోడ వెస నిన్ను నద్దలించి
మేడెపురతికి నాకె మీరివచ్చీని
(॥ఎవ్వ॥)
కందువఁ గాఁగిటఁ గూడి కాంతను శ్రీవేంకటేశ
సందడి మోవితేనె చవిచూచేవు
మందలించి నిన్ను నాకె మనసు రంజిలఁజేసి
ముందుముందె నీమర్మములు ముట్టీని
(||pallavi||)
ĕvvari nemanam̐gala mippuḍu nemu
nivvaḍilla mimmum̐ jūsi navve miṁtegāga
(||ĕvva||)
nerubulanniyum̐ jūbi nĕlam̐tabayyadagŏṁgu
sārĕm̐ dīsi yiṭṭĕ sarasamulāḍevu
ārideri ninnu nābĕ anavĕṭṭi palumāru
dūrudānu pĕṁjĕmaḍa goram̐ jimmīni
(||ĕvva||)
veḍugalu vuṭṭiṁchi vĕlam̐disannulamīm̐da
toḍane kuṁkuma vūsi dŏmmisesevu
vīḍinadurumudoḍa vĕsa ninnu naddaliṁchi
meḍĕburadigi nāgĕ mīrivachchīni
(||ĕvva||)
kaṁduvam̐ gām̐giḍam̐ gūḍi kāṁtanu śhrīveṁkaḍeśha
saṁdaḍi movidenĕ savisūsevu
maṁdaliṁchi ninnu nāgĕ manasu raṁjilam̐jesi
muṁdumuṁdĕ nīmarmamulu muṭṭīni