ఎవ్వరి నేమడిగేవు యెందాఁకాను
(॥పల్లవి॥)
ఎవ్వరి నేమడిగేవు యెందాఁకాను
రవ్వలేల సేసేవు రతిఁ గూడరాదా
(॥॥)
చిగిరించె వలపులు చేగదేరె సిగ్గులు
నగవు సెలవి నిండె నలినాక్షికి
అగడేల సేసేవు ఆసలేల దాఁచేవు
తగు మీకిద్దరికిని తలఁచుకోరాదా
(॥॥)
పచ్చిదేరే కళలు బలువాయఁ దమకము
రచ్చకెక్కె విన్నపాలు రమణికిని
కొచ్చి యెంతపెనఁ గేవు కోరికలెట్టుడి పేవు
హెచ్చుఁ గుందు లేదు మీకు నెనయఁగరాదా
(॥॥)
తారుకాణాయఁ జూపులు తతిగొనెఁ బాయము
మేరుతో నీపోందు లబ్బె మెలుఁతకును
యీరీతి శ్రీ వేంకటేశ యీగురు లెట్టు మూసేవు
యీరసములేదు మీకు యిచ్చనుండరాదా
(||pallavi||)
ĕvvari nemaḍigevu yĕṁdām̐kānu
ravvalela sesevu radim̐ gūḍarādā
(||||)
sigiriṁchĕ valabulu segaderĕ siggulu
nagavu sĕlavi niṁḍĕ nalinākṣhigi
agaḍela sesevu āsalela dām̐sevu
tagu mīgiddarigini talam̐sugorādā
(||||)
pachchidere kaḽalu baluvāyam̐ damagamu
rachchagĕkkĕ vinnabālu ramaṇigini
kŏchchi yĕṁtabĕnam̐ gevu korigalĕṭṭuḍi pevu
hĕchchum̐ guṁdu ledu mīgu nĕnayam̐garādā
(||||)
tārugāṇāyam̐ jūbulu tadigŏnĕm̐ bāyamu
merudo nīboṁdu labbĕ mĕlum̐tagunu
yīrīdi śhrī veṁkaḍeśha yīguru lĕṭṭu mūsevu
yīrasamuledu mīgu yichchanuṁḍarādā