ఎవ్వరి నడుగనేల యేడ లేని యానలేల
(॥పల్లవి॥)
ఎవ్వరి నడుగనేల యేడ లేని యానలేల
దివ్వె చేతఁ బట్టువొని తెరువు దప్పకురా
(॥॥)
పంతమాడ నోపఁగాని భావము నీదిట్టిదని
పొంతనే నేఁడక్కుననుఁ బోసి చూపేరా
యెంత దాఁచిననుఁ బోదు యేల నాతో బొంక నీవు
అంతా నీకే కానవచ్చీ నద్దము చూచుకోరా
(॥॥)
నిన్నుఁ గల్ల సేయఁ గాని నీకుఁ గల మోహమెల్లా
వన్నెగాఁ బూవుల చేరువలె నెత్తేరా
కన్ను గిరిపితేఁ గాదు కాంతలెల్లా నెరిఁగిరి
మొన్నటి నిన్నటివి నీమోముపై నున్నవిరా
(॥॥)
వాదడువఁ జాలఁగాని వక్కణించి నీగుట్టెల్లా
సాదించి నీరుకంటెఁ బలచన సేసేరా
పోదిగా శ్రీవేంకటేశ పొంచి నన్నుఁ గూడితివి
వేదేల నీవుంగరము నేల నీకున్నదిరా
(||pallavi||)
ĕvvari naḍuganela yeḍa leni yānalela
divvĕ sedam̐ baṭṭuvŏni tĕruvu dappagurā
(||||)
paṁtamāḍa nobam̐gāni bhāvamu nīdiṭṭidani
pŏṁtane nem̐ḍakkunanum̐ bosi sūberā
yĕṁta dām̐sinanum̐ bodu yela nādo bŏṁka nīvu
aṁtā nīge kānavachchī naddamu sūsugorā
(||||)
ninnum̐ galla seyam̐ gāni nīgum̐ gala mohamĕllā
vannĕgām̐ būvula seruvalĕ nĕtterā
kannu giribidem̐ gādu kāṁtalĕllā nĕrim̐giri
mŏnnaḍi ninnaḍivi nīmomubai nunnavirā
(||||)
vādaḍuvam̐ jālam̐gāni vakkaṇiṁchi nīguṭṭĕllā
sādiṁchi nīrugaṁṭĕm̐ balasana seserā
podigā śhrīveṁkaḍeśha pŏṁchi nannum̐ gūḍidivi
vedela nīvuṁgaramu nela nīgunnadirā