ఎవ్వరి మెచ్చఁ దగవు యిద్దరిలో రామరామ
(॥పల్లవి॥)
ఎవ్వరి మెచ్చఁ దగవు యిద్దరిలో రామరామ
రవ్వగా సురలు విచారము సేసే రిందుకే
(॥ఎవ్వ॥)
దశరథు యజ్ఞములో తగ నీవు జనియింప
దశకంఠుమేనఁ బుట్టె దావాగ్ని
వశమైన శాంతితో వర్ణనకెక్కితి నీవు
దశకంఠుఁ డంటి నట్టిధర్మ మందె సమసె
(॥ఎవ్వ॥)
నెఱిఁ దొల్లి సీతకిఁగా నీవు విల్లెత్తఁగానను
చెఱకు విల్లెత్తె నీపెఁ జేరి మరుఁడు
విఱిగె నీవెత్తివట్టి విల్లయితే నెంతైన
విఱుగ కాతనివిల్లు వెసఁ బెండ్లిసేసెను
(॥ఎవ్వ॥)
శ్రీ వేంకటాద్రిమీఁదఁ జేరి యెక్కితివి నీవు
ఆ వెలఁది నీవుర మట్టె యెక్కెను
దేవుఁడైవై ఇందరిలోఁ దిరుగాడుదువు గాని
వోవల నాకైతే నీపై వున్నచోనే వున్నది
(||pallavi||)
ĕvvari mĕchcham̐ dagavu yiddarilo rāmarāma
ravvagā suralu visāramu sese riṁduge
(||ĕvva||)
daśharathu yajñamulo taga nīvu janiyiṁpa
daśhagaṁṭhumenam̐ buṭṭĕ dāvāgni
vaśhamaina śhāṁtido varṇanagĕkkidi nīvu
daśhagaṁṭhum̐ ḍaṁṭi naṭṭidharma maṁdĕ samasĕ
(||ĕvva||)
nĕṟim̐ dŏlli sīdagim̐gā nīvu villĕttam̐gānanu
sĕṟagu villĕttĕ nībĕm̐ jeri marum̐ḍu
viṟigĕ nīvĕttivaṭṭi villayide nĕṁtaina
viṟuga kādanivillu vĕsam̐ bĕṁḍlisesĕnu
(||ĕvva||)
śhrī veṁkaḍādrimīm̐dam̐ jeri yĕkkidivi nīvu
ā vĕlam̐di nīvura maṭṭĕ yĕkkĕnu
devum̐ḍaivai iṁdarilom̐ dirugāḍuduvu gāni
vovala nāgaide nībai vunnasone vunnadi