Evvari doore memanamgala mimka

ఎవ్వరి దూరే మేమనఁగల మిఁక
Language

(॥పల్లవి॥)
ఎవ్వరి దూరే మేమనఁగల మిఁక
జవ్వనపు మీకె చందములాయ

(॥ఎవ్వ॥)
కలిమికి లేమికిఁ గాణాచి యదియె
అలివేణిచన్ను లసియాడునడుము
చెలువుఁడ నీలోచిత్తము కఠినము
పలచనికెమ్మోవి పతికిఁ బతియాయ

(॥ఎవ్వ॥)
చీకటి వెలుఁగుకు సీమది యొకటే
నీకాంతతురుము నీచూపు
వాకున వినయము వళుకులు చెంతల
సాకిరిరమణుఁడ సరికి సరియాయ

(॥ఎవ్వ॥)
చిగురుకుఁ జేవకు శేఖరమొకటే
మగువహస్తనఖమహిమ లవె
తెగి శ్రీవేంకటదేవ నీకొకటె
తగవులు నగవులు తగురతులాయ

(||pallavi||)
ĕvvari dūre memanam̐gala mim̐ka
javvanabu mīgĕ saṁdamulāya

(||ĕvva||)
kalimigi lemigim̐ gāṇāsi yadiyĕ
aliveṇisannu lasiyāḍunaḍumu
sĕluvum̐ḍa nīlosittamu kaṭhinamu
palasanigĕmmovi padigim̐ badiyāya

(||ĕvva||)
sīgaḍi vĕlum̐gugu sīmadi yŏgaḍe
nīgāṁtadurumu nīsūbu
vāguna vinayamu vaḽugulu sĕṁtala
sāgiriramaṇum̐ḍa sarigi sariyāya

(||ĕvva||)
sigurugum̐ jevagu śhekharamŏgaḍe
maguvahastanakhamahima lavĕ
tĕgi śhrīveṁkaḍadeva nīgŏgaḍĕ
tagavulu nagavulu taguradulāya