ఎవ్వరి బలువు వీరి నేమందమే
(॥పల్లవి॥)
ఎవ్వరి బలువు వీరి నేమందమే
పువ్వులు బలియఁగాను పూఁపలాయ నిదివో
(॥ఎవ్వ॥)
సిగ్గుపడివున్నచెలిఁ జేయివట్టితియ్యఁబోతే
దిగ్గనను వినరానితిట్లు దిట్టెను
యెగ్గువట్టక విభుఁడు యెగసక్కేలకే మరి
బిగ్గెఁగాఁగిలించి మోవి పిప్పిసేసె నిదివో
(॥ఎవ్వ॥)
మూలనున్న యింతిఁ బట్టి ముంగిటికిఁ దీసితేను
తాలిమిసేయరానిసేఁతలు చేసెను
బేలుఁడై యుండ కితఁడు ప్రియమునఁ జెలరేఁగి
కాలుదొక్కి పానుపుపై కందువంటె నిదివో
(॥ఎవ్వ॥)
వొద్దనున్న ఇల్లాలి నురముపైఁ బెట్టుకొంటే
గద్దించి బొమ్మజంకెలఁ గై కొని కూడె
వొద్దికై శ్రీవేంకలేశుఁ డొనగూడి మన్నించి
పెద్దరికమెల్లాఁ జేసి ప్రియమాడె నిదివో
(||pallavi||)
ĕvvari baluvu vīri nemaṁdame
puvvulu baliyam̐gānu pūm̐palāya nidivo
(||ĕvva||)
siggubaḍivunnasĕlim̐ jeyivaṭṭidiyyam̐bode
diggananu vinarānidiṭlu diṭṭĕnu
yĕgguvaṭṭaga vibhum̐ḍu yĕgasakkelage mari
biggĕm̐gām̐giliṁchi movi pippisesĕ nidivo
(||ĕvva||)
mūlanunna yiṁtim̐ baṭṭi muṁgiḍigim̐ dīsidenu
tālimiseyarānisem̐talu sesĕnu
belum̐ḍai yuṁḍa kidam̐ḍu priyamunam̐ jĕlarem̐gi
kāludŏkki pānububai kaṁduvaṁṭĕ nidivo
(||ĕvva||)
vŏddanunna illāli nuramubaim̐ bĕṭṭugŏṁṭe
gaddiṁchi bŏmmajaṁkĕlam̐ gai kŏni kūḍĕ
vŏddigai śhrīveṁkaleśhum̐ ḍŏnagūḍi manniṁchi
pĕddarigamĕllām̐ jesi priyamāḍĕ nidivo