Evvarevvari pamtaalu yedu vachchuno

ఎవ్వరెవ్వరి పంతాలు యెటు వచ్చునో
Language

(॥పల్లవి॥)
ఎవ్వరెవ్వరి పంతాలు యెటు వచ్చునో
ఇవ్వల వీరి నేరుపు లేమి చెప్పేమే

(॥ఎవ్వ॥)
మాటలాడమని లోలో మరి వొట్టువెట్టుకొని
యీటునఁ గొంతవ డూర కిద్దరు నుండి
పాటించి ఇంతిచెల్లెలిఁ బట్టితెచ్చి నాయకుఁడు
గోటారించి భంగించఁగా కొమ్మ వేఁడుకొనెను

(॥ఎవ్వ॥)
మోములు చూడమనుచు ముంచి వొట్లువెట్టుక
వోముచుఁ గొంతవడి తామూరకే వుండి
నేమమున నద్దములో నీడలు దెచ్చి విభుఁడు
భామినికిఁ జూపితేను పై పై జంకించెను

(॥ఎవ్వ॥)
కూడమంటాఁ గోపమునఁ గోరి వొట్టువెట్టుకొని
వోడక కొంతవడిదాఁ కూరకే వుండి
వేడుకాపె కాళాఁజ శ్రీవేంకటేశుఁ డంటఁబోఁగా
గాఢల వద్దంటా సతి కాఁగిలించి పట్టెను

(||pallavi||)
ĕvvarĕvvari paṁtālu yĕḍu vachchuno
ivvala vīri nerubu lemi sĕppeme

(||ĕvva||)
māḍalāḍamani lolo mari vŏṭṭuvĕṭṭugŏni
yīḍunam̐ gŏṁtava ḍūra kiddaru nuṁḍi
pāḍiṁchi iṁtisĕllĕlim̐ baṭṭidĕchchi nāyagum̐ḍu
goḍāriṁchi bhaṁgiṁcham̐gā kŏmma vem̐ḍugŏnĕnu

(||ĕvva||)
momulu sūḍamanusu muṁchi vŏṭluvĕṭṭuga
vomusum̐ gŏṁtavaḍi tāmūrage vuṁḍi
nemamuna naddamulo nīḍalu dĕchchi vibhum̐ḍu
bhāminigim̐ jūbidenu pai pai jaṁkiṁchĕnu

(||ĕvva||)
kūḍamaṁṭām̐ gobamunam̐ gori vŏṭṭuvĕṭṭugŏni
voḍaga kŏṁtavaḍidām̐ kūrage vuṁḍi
veḍugābĕ kāḽām̐ja śhrīveṁkaḍeśhum̐ ḍaṁṭam̐bom̐gā
gāḍhala vaddaṁṭā sadi kām̐giliṁchi paṭṭĕnu