Evvarerumgudurayyaa ittivi nee suddulu

ఎవ్వరెరుఁగుదురయ్యా ఇట్టివి నీ సుద్దులు
Language

(॥పల్లవి॥)
ఎవ్వరెరుఁగుదురయ్యా ఇట్టివి నీ సుద్దులు
జవ్వనపు వేడుకల సరినోలలాడేవు

(॥ఎవ్వ॥)
తలఁపునఁ బారెనో తరుణి తమగుబ్బలు
పలుమారు నిమ్మపండే పట్టియాడేవు
కలలోనవచ్చెనో కలికి చక్కనిరూపు
మలసి చిత్తరుపతిమల వా(వ్రా?)సేవు

(॥ఎవ్వ॥)
విని నట్టాయనో నీకు వీనుల నాపె యెలుఁగు
అనుమానించక యట్టె యాలకించెవు
మునుకొని యాపై నీ మోమునఁ గట్టినట్టాయనో
పనివూని వేమారు భావించి చూచేవు

(॥ఎవ్వ॥)
కూరిమి నాకెమోవిపై కోరికలు రేఁగెనో
సారె సారె గుక్కిళ్లు చవిగొనేవు
యీరీతి శ్రీవెంకటేశ యేలితివి నన్ను నేఁడు
గారవించి నాకొరికే కాదుగదా నవ్వేవు

(||pallavi||)
ĕvvarĕrum̐gudurayyā iṭṭivi nī suddulu
javvanabu veḍugala sarinolalāḍevu

(||ĕvva||)
talam̐punam̐ bārĕno taruṇi tamagubbalu
palumāru nimmabaṁḍe paṭṭiyāḍevu
kalalonavachchĕno kaligi sakkanirūbu
malasi sittarubadimala vā(vrā?)sevu

(||ĕvva||)
vini naṭṭāyano nīgu vīnula nābĕ yĕlum̐gu
anumāniṁchaga yaṭṭĕ yālagiṁchĕvu
munugŏni yābai nī momunam̐ gaṭṭinaṭṭāyano
panivūni vemāru bhāviṁchi sūsevu

(||ĕvva||)
kūrimi nāgĕmovibai korigalu rem̐gĕno
sārĕ sārĕ gukkiḽlu savigŏnevu
yīrīdi śhrīvĕṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
gāraviṁchi nāgŏrige kādugadā navvevu