Evvaremta penamginaa nemaayanu

ఎవ్వరెంత పెనఁగినా నేమాయను
Language

(॥పల్లవి॥)
ఎవ్వరెంత పెనఁగినా నేమాయను
నవ్వుతా నుండే నేను నావాఁడే అతఁడు

(॥ఎవ్వ॥)
ననుపుగలుగువారు నాయకునితోడుత
మనవులు చెప్పితేను మానుపరాదు
కనుఁగొంటా నుండుదము కాంతలసరితలెల్లా
నను మన్నించు నాతఁడు నావాఁడే యెపుడు

(॥ఎవ్వ॥)
కొలువేసేసేవారు కోరి సేవలుసేసి
వలపులు చల్లితేను వద్దనరాదు
తెలుతము తమతమతెరఁగులెల్లా నేఁడు
నలి నన్ను మన్నించె నావాఁడే యతఁడు

(॥ఎవ్వ॥)
యేతులఁ బెండ్లాడిన వా రెంతసరసాలాడినా
కాతరించి పెనఁగినాఁ గాదనరాదు
యీతల శ్రీవేంకటేశుఁడే నలమేలుమంగను
నాతగులై నన్నుఁ గూడె నావాఁడే యతడు

(||pallavi||)
ĕvvarĕṁta pĕnam̐ginā nemāyanu
navvudā nuṁḍe nenu nāvām̐ḍe adam̐ḍu

(||ĕvva||)
nanubugaluguvāru nāyagunidoḍuda
manavulu sĕppidenu mānubarādu
kanum̐gŏṁṭā nuṁḍudamu kāṁtalasaridalĕllā
nanu manniṁchu nādam̐ḍu nāvām̐ḍe yĕbuḍu

(||ĕvva||)
kŏluvesesevāru kori sevalusesi
valabulu sallidenu vaddanarādu
tĕludamu tamadamadĕram̐gulĕllā nem̐ḍu
nali nannu manniṁchĕ nāvām̐ḍe yadam̐ḍu

(||ĕvva||)
yedulam̐ bĕṁḍlāḍina vā rĕṁtasarasālāḍinā
kādariṁchi pĕnam̐ginām̐ gādanarādu
yīdala śhrīveṁkaḍeśhum̐ḍe nalamelumaṁganu
nādagulai nannum̐ gūḍĕ nāvām̐ḍe yadaḍu