ఎవ్వరేమి చెప్పినా నీకిదేమాఁ (వ?)ట
(॥పల్లవి॥)
ఎవ్వరేమి చెప్పినా నీకిదేమాఁ (వ?)ట
యివ్వల నేనిట్లైతి నిదేమాఁట
(॥ఎవ్వ॥)
చెప్పఁగానే లోనయితి చెయి నీకు మీఁదాయ
యిప్పటికి నీవాడేదిదేమాట
తప్పులేదు నీకయితే తమకము పసలేదు
యెప్పుడు నేమే వెఱ్ఱులమిదేమాఁట
(॥ఎవ్వ॥)
కదిసితి మిద్దరము కాదు కూడదనరాదు
యెదురు గుదురుగా నీ కిదేమాట
మొదలనే మోసపోతి ముచ్చటకుఁ బనిలేదు
యెద వెట్టుకోనోప నిదేమాట
(॥ఎవ్వ॥)
కాంతలిందరు నెరఁగఁ గాలు దొక్కితివి నన్ను
యింతటివాఁడవు నీ కిదేమాట
అంతలోనె శ్రీవేంకటేశ ఆదరించి కూడితివి
యెంతైన విడువవు నీ కిదే మాట
(||pallavi||)
ĕvvaremi sĕppinā nīgidemām̐ (va?)ṭa
yivvala neniṭlaidi nidemām̐ṭa
(||ĕvva||)
sĕppam̐gāne lonayidi sĕyi nīgu mīm̐dāya
yippaḍigi nīvāḍedidemāḍa
tappuledu nīgayide tamagamu pasaledu
yĕppuḍu neme vĕṭrulamidemām̐ṭa
(||ĕvva||)
kadisidi middaramu kādu kūḍadanarādu
yĕduru gudurugā nī kidemāḍa
mŏdalane mosabodi muchchaḍagum̐ baniledu
yĕda vĕṭṭugonoba nidemāḍa
(||ĕvva||)
kāṁtaliṁdaru nĕram̐gam̐ gālu dŏkkidivi nannu
yiṁtaḍivām̐ḍavu nī kidemāḍa
aṁtalonĕ śhrīveṁkaḍeśha ādariṁchi kūḍidivi
yĕṁtaina viḍuvavu nī kide māḍa