Evvaremi sepperu yimka neegunu

ఎవ్వరేమి చెప్పేరు యిఁక నీకును
Language

(॥పల్లవి॥)
ఎవ్వరేమి చెప్పేరు యిఁక నీకును
నివ్వటిల్ల నింకా నవే నేరుచుకోవయ్యా

(॥॥)
ఆసపడి రతులకు నండ నుండి చిత్తమురా
సెసేఁగా ఆకె నీకు సేవలెల్లాను
పూసగుచ్చినుట్టు చెప్పి బుద్దులెల్లా నీకు నూరి-
పోసెఁగా చెవిలోనను పొద్దు వొద్దు నీకును

(॥॥)
వాడికగా నీమీఁద వలపులు చల్లి చల్లి
వీడెమిచ్చెఁగా నీకు వేడుకతోను
యేడలేని సుద్దులెల్లా నెచ్చరించి యింతేసి
తోడ సాము సేయించెఁగా దొరతనమునను

(॥॥)
చెక్కునొక్కి సేసవెట్టి సేఁతలెల్లాఁజేసి చూపి
చిక్కించెఁగా ఆపె నిన్ను శ్రీ వేంకటేశ
మక్కువతో నీచేత మన్నింపించి నన్ను మెచ్చి
మిక్కిలి నవ్వునవ్వెఁగా మేరమీరి నిన్నును

(||pallavi||)
ĕvvaremi sĕpperu yim̐ka nīgunu
nivvaḍilla niṁkā nave nerusugovayyā

(||||)
āsabaḍi radulagu naṁḍa nuṁḍi sittamurā
sĕsem̐gā āgĕ nīgu sevalĕllānu
pūsaguchchinuṭṭu sĕppi buddulĕllā nīgu nūri-
posĕm̐gā sĕvilonanu pŏddu vŏddu nīgunu

(||||)
vāḍigagā nīmīm̐da valabulu salli salli
vīḍĕmichchĕm̐gā nīgu veḍugadonu
yeḍaleni suddulĕllā nĕchchariṁchi yiṁtesi
toḍa sāmu seyiṁchĕm̐gā dŏradanamunanu

(||||)
sĕkkunŏkki sesavĕṭṭi sem̐talĕllām̐jesi sūbi
sikkiṁchĕm̐gā ābĕ ninnu śhrī veṁkaḍeśha
makkuvado nīseda manniṁpiṁchi nannu mĕchchi
mikkili navvunavvĕm̐gā meramīri ninnunu