Evvarekkudo mee iddarilona

ఎవ్వరెక్కుడో మీ ఇద్దరిలోన
Language

(॥పల్లవి॥)
ఎవ్వరెక్కుడో మీ ఇద్దరిలోన
జవ్వనమే పైఁజల్లి సాదించె నిన్నును

(॥ఎవ్వ॥)
తెలిఁగన్నులవాఁడవు తేటమాటలవాఁడవు
వలవకుందురా నీకువనితలెల్లా
చలమరికాంత యాకె చనవుగలది యాకె
మొలకనవ్వులనే మోహింపించె నిన్నును

(॥ఎవ్వ॥)
ఇచ్చకపువాఁడవు ఇన్నిటాను జాణవు
మెచ్చకుందువా నిన్ను మెలఁతలెల్లా
నిచ్చపెండ్లికూఁతు రాపె నెయ్యము సేసిన దాపె
పెచ్చు రేఁగి ఇంపుల మెప్పించె నిదెనిన్నును

(॥ఎవ్వ॥)
సేసచల్లేవాఁడవు శ్రీవేంకటేశుఁడవు
ఆసపడకుందురా అంగనలెల్లా
వేసర నలమేల్మంగ వివరి యన్నిటా నాపె
వాసిఁ గూడి యాసలలో వడి ముంచె నిన్నును

(||pallavi||)
ĕvvarĕkkuḍo mī iddarilona
javvaname paim̐jalli sādiṁchĕ ninnunu

(||ĕvva||)
tĕlim̐gannulavām̐ḍavu teḍamāḍalavām̐ḍavu
valavaguṁdurā nīguvanidalĕllā
salamarigāṁta yāgĕ sanavugaladi yāgĕ
mŏlaganavvulane mohiṁpiṁchĕ ninnunu

(||ĕvva||)
ichchagabuvām̐ḍavu inniḍānu jāṇavu
mĕchchaguṁduvā ninnu mĕlam̐talĕllā
nichchabĕṁḍligūm̐tu rābĕ nĕyyamu sesina dābĕ
pĕchchu rem̐gi iṁpula mĕppiṁchĕ nidĕninnunu

(||ĕvva||)
sesasallevām̐ḍavu śhrīveṁkaḍeśhum̐ḍavu
āsabaḍaguṁdurā aṁganalĕllā
vesara nalamelmaṁga vivari yanniḍā nābĕ
vāsim̐ gūḍi yāsalalo vaḍi muṁchĕ ninnunu