Evvaree buddulu vina remdaamkaanu

ఎవ్వరీ బుద్దులు విన రెందాఁకాను
Language

(॥పల్లవి॥)
ఎవ్వరీ బుద్దులు విన రెందాఁకాను
యివ్వల జాగరా లున్నా రెందాఁకాను

(॥ఎవ్వ॥)
చక్కెరమోవులు వాడె సరసములలోననె
యెక్కడి ఆలుకలు మీ కెందాఁకాను
ముక్కున నూర్పులు రేఁగె ముట్టీముట్టుక తొల్లె
యిక్కువ పంతములు మీ కెందాఁకాను

(॥ఎవ్వ॥)
కన్నులఁ గావులు గప్పె కందువనవ్వులలోనె
యెన్నేసి వొట్లు వెట్టే రెందాఁకాను
తన్నుఁ దానె చెవరించె తనువుల నిద్దరికి
యిన్నిటా మీ మతకము లెందాఁకాను

(॥ఎవ్వ॥)
మోమునఁ గళలు రేగె ముంచినసిగ్గులలోనె
యేమిటికి ననుమానా లెందాఁకాను
వేమారుఁ గూడితిరి శ్రీవెంకటేశుఁడును నీవు
యీ మాట లందరుఁ జెప్పే రెందాఁకాను

(||pallavi||)
ĕvvarī buddulu vina rĕṁdām̐kānu
yivvala jāgarā lunnā rĕṁdām̐kānu

(||ĕvva||)
sakkĕramovulu vāḍĕ sarasamulalonanĕ
yĕkkaḍi ālugalu mī kĕṁdām̐kānu
mukkuna nūrbulu rem̐gĕ muṭṭīmuṭṭuga tŏllĕ
yikkuva paṁtamulu mī kĕṁdām̐kānu

(||ĕvva||)
kannulam̐ gāvulu gappĕ kaṁduvanavvulalonĕ
yĕnnesi vŏṭlu vĕṭṭe rĕṁdām̐kānu
tannum̐ dānĕ sĕvariṁchĕ tanuvula niddarigi
yinniḍā mī madagamu lĕṁdām̐kānu

(||ĕvva||)
momunam̐ gaḽalu regĕ muṁchinasiggulalonĕ
yemiḍigi nanumānā lĕṁdām̐kānu
vemārum̐ gūḍidiri śhrīvĕṁkaḍeśhum̐ḍunu nīvu
yī māḍa laṁdarum̐ jĕppe rĕṁdām̐kānu