Evvaramu vaddanunnaa nemiselavu

ఎవ్వరము వద్దనున్నా నేమిసెలవు
Language

(॥పల్లవి॥)
ఎవ్వరము వద్దనున్నా నేమిసెలవు
జవ్వన మాపె వల్లనే చవులు వుట్టించెనా

(॥ఎవ్వ॥)
వంతులకు నాపె వచ్చి వద్దఁ గూచుండినపుడు
అంతట నీ కోరికెల్లా నాయనా నేఁడు
పంతముననే ముట్టి పాదము లిందాఁకానొత్తె
యింతలో నీయనుమాన మిక్కడనే పాసెనా

(॥ఎవ్వ॥)
మనసిచ్చి యాపె నీతో మాటలెల్లా నాడఁగాను
చనవున నీలో ముచ్చట వాసెనా
చెనకి యాపె నిన్నుఁ జెయివట్టి తియ్యఁగాను
తనువుపై వలపుల దామెల్లానారెనా

(॥ఎవ్వ॥)
పలుమారు నీకు నాపె బాగాలందియ్యఁగాను
యెలమి నామోము చూడనితవాయనా
నిలిచి శ్రీవేంకటేశ నీవు నన్నే కూడితివి
తొలుత నీవు సేసిన దోసమెల్లాఁ బాసెనా

(||pallavi||)
ĕvvaramu vaddanunnā nemisĕlavu
javvana mābĕ vallane savulu vuṭṭiṁchĕnā

(||ĕvva||)
vaṁtulagu nābĕ vachchi vaddam̐ gūsuṁḍinabuḍu
aṁtaḍa nī korigĕllā nāyanā nem̐ḍu
paṁtamunane muṭṭi pādamu liṁdām̐kānŏttĕ
yiṁtalo nīyanumāna mikkaḍane pāsĕnā

(||ĕvva||)
manasichchi yābĕ nīdo māḍalĕllā nāḍam̐gānu
sanavuna nīlo muchchaḍa vāsĕnā
sĕnagi yābĕ ninnum̐ jĕyivaṭṭi tiyyam̐gānu
tanuvubai valabula dāmĕllānārĕnā

(||ĕvva||)
palumāru nīgu nābĕ bāgālaṁdiyyam̐gānu
yĕlami nāmomu sūḍanidavāyanā
nilisi śhrīveṁkaḍeśha nīvu nanne kūḍidivi
tŏluda nīvu sesina dosamĕllām̐ bāsĕnā