ఎవ్వరంటాఁ జూచేవు యింతిని వో నాయకుఁడ
(॥పల్లవి॥)
ఎవ్వరంటాఁ జూచేవు యింతిని వో నాయకుఁడ
జవ్వని యా రతిరాజసంపదే కాదా
(॥ఎవ్వ॥)
చెలియచిత్తములోని చిత్తజునమ్ము లేకావా
చిలుకుఁజూపరలై చిమ్మిరేఁగెను
చలువైన నెమ్మోము చందురు వెన్నెలే కాదా
పలచనినవ్వులై పచ్చిదేరేవి
(॥ఎవ్వ॥)
సతికొప్పు మేఘముజడివానలేకావా
మితిలేనిచెమటలై మేన నున్నవి
చతురై నడిమియాకసపు మెఱుఁగులేకావా
తతితో బంగారువన్నె తళుకు లివి
(॥ఎవ్వ॥)
కుత్తికలో గోవిలకూఁతలు నేఁ డివె కావా
కొత్తయి నీకాఁగిటిలో గుమ్మరించేవి
హత్తినశ్రీవేంకటేశ అంగననీకూటములు
మొత్తమి వొంగేటిభావములసొంపుగాదా
(||pallavi||)
ĕvvaraṁṭām̐ jūsevu yiṁtini vo nāyagum̐ḍa
javvani yā radirājasaṁpade kādā
(||ĕvva||)
sĕliyasittamuloni sittajunammu legāvā
silugum̐jūbaralai simmirem̐gĕnu
saluvaina nĕmmomu saṁduru vĕnnĕle kādā
palasaninavvulai pachchiderevi
(||ĕvva||)
sadigŏppu meghamujaḍivānalegāvā
midilenisĕmaḍalai mena nunnavi
sadurai naḍimiyāgasabu mĕṟum̐gulegāvā
tadido baṁgāruvannĕ taḽugu livi
(||ĕvva||)
kuttigalo govilagūm̐talu nem̐ ḍivĕ kāvā
kŏttayi nīgām̐giḍilo gummariṁchevi
hattinaśhrīveṁkaḍeśha aṁgananīgūḍamulu
mŏttami vŏṁgeḍibhāvamulasŏṁpugādā