ఎవ్వర మేమైతి మేమి యేలే తనకు
(॥పల్లవి॥)
ఎవ్వర మేమైతి మేమి యేలే తనకు
నవ్వుతా నుండీఁ దనకు నయ మిదే కాదా
(॥ఎవ్వ॥)
చింతతో నుందాననంటాఁ జెక్కుచేయిడితినంటా
కొంత గొంత నన్ను నేల గోర సేసీనే
యింతులై నవారిఁ దెచ్చి యింత సేసితి వనేటి-
పంతము చెల్లెఁ దనకు ఫల మిదే చాలదా
(॥ఎవ్వ॥)
వేడెము నేఁ జేయనంటా విచారాలే హెచ్చెనంటా
యీడ నాడ వారితోడ నేల చెప్పీనే
వూడిగము సేయఁగానే వొద్దఁ గూచుండు మనీని
వాడు దేరి తానుండితే వంతు మాకుఁ జెల్లునా
(॥ఎవ్వ॥)
తలవంచుకొంటినంటా తాపాన నుందానవంటా
పలికించి నన్ను నేల బాద పెట్టీనే
యెలమి శ్రీవేంకటేశుఁడిట్టె తానె నన్నుఁ గూడెఁ
నలమేలుమంగను నే నదేమేలు గాదా
(||pallavi||)
ĕvvara memaidi memi yele tanagu
navvudā nuṁḍīm̐ danagu naya mide kādā
(||ĕvva||)
siṁtado nuṁdānanaṁṭām̐ jĕkkuseyiḍidinaṁṭā
kŏṁta gŏṁta nannu nela gora sesīne
yiṁtulai navārim̐ dĕchchi yiṁta sesidi vaneḍi-
paṁtamu sĕllĕm̐ danagu phala mide sāladā
(||ĕvva||)
veḍĕmu nem̐ jeyanaṁṭā visārāle hĕchchĕnaṁṭā
yīḍa nāḍa vāridoḍa nela sĕppīne
vūḍigamu seyam̐gāne vŏddam̐ gūsuṁḍu manīni
vāḍu deri tānuṁḍide vaṁtu māgum̐ jĕllunā
(||ĕvva||)
talavaṁchugŏṁṭinaṁṭā tābāna nuṁdānavaṁṭā
paligiṁchi nannu nela bāda pĕṭṭīne
yĕlami śhrīveṁkaḍeśhum̐ḍiṭṭĕ tānĕ nannum̐ gūḍĕm̐
nalamelumaṁganu ne nademelu gādā