ఎవ్వనిఁ దలఁచితివే ఎక్కడే మోహించితివే
(॥పల్లవి॥)
ఎవ్వనిఁ దలఁచితివే ఎక్కడే మోహించితివే
చివ్వనఁ జెప్పవే నాతో సిగ్గుపడనేఁటికి
(॥ఎవ్వ॥)
చెక్కులేల చెమరించె చెలియ నీ కిదె నేఁడు
వెక్కసపుటెండలతో వేసవి రాదు
గక్కున నీమేనేల కడుఁ బులకించె నేఁడు
వక్కణింప నింక జడివానలు రావు
(॥ఎవ్వ॥)
వెలువెల్లఁబారనేలే వెన్నెలబొమ్మవలె
అలరు శారదసమయంబు గాదు
పలకేనీమోవి నేల పక్కులుగట్టే నేఁడు
కలికి యిప్పుడు మంచుకాలము గాదు
(॥ఎవ్వ॥)
కప్ప నేల పయ్యదను కాలమిది చలి గాదు
చెప్పలేదు వసంతము చిగిరించెను
దప్పిదేర నిటు గూడె తరగ నిన్ను నింత చేసె
యిప్పుడా శ్రీ వేంకటేశుఁ డేడనున్నాఁడే
(||pallavi||)
ĕvvanim̐ dalam̐sidive ĕkkaḍe mohiṁchidive
sivvanam̐ jĕppave nādo siggubaḍanem̐ṭigi
(||ĕvva||)
sĕkkulela sĕmariṁchĕ sĕliya nī kidĕ nem̐ḍu
vĕkkasabuḍĕṁḍalado vesavi rādu
gakkuna nīmenela kaḍum̐ bulagiṁchĕ nem̐ḍu
vakkaṇiṁpa niṁka jaḍivānalu rāvu
(||ĕvva||)
vĕluvĕllam̐bāranele vĕnnĕlabŏmmavalĕ
alaru śhāradasamayaṁbu gādu
palagenīmovi nela pakkulugaṭṭe nem̐ḍu
kaligi yippuḍu maṁchugālamu gādu
(||ĕvva||)
kappa nela payyadanu kālamidi sali gādu
sĕppaledu vasaṁtamu sigiriṁchĕnu
dappidera niḍu gūḍĕ taraga ninnu niṁta sesĕ
yippuḍā śhrī veṁkaḍeśhum̐ ḍeḍanunnām̐ḍe