(॥పల్లవి॥)
ఎవ్వనికి వలతువే చెలియా
యెవ్వలఁ బిలిచిన నెఱఁగవే చెలియా
(॥॥)
చక్కఁగఁ బయ్యదజారిన దెఱఁగవు
యెక్కడ చూచేవే యిటు చెలియా
చెక్కులవెంటఁ జెమటలు వడియఁగ
ముక్కున నూర్పులు ముంచేవే చెలియా
(॥॥)
జాఱినకొప్పునుఁ జక్కఁగఁ బెట్టవు
మీఱేవు పరాకున నేమే చెలియ
మాఱుమాటలును మాతో నాడవు
తీఱక లోవెలిఁ దిరిగేవే చెలియా
(॥॥)
వెలయ హరములు వెనకకు వేసితి
తలఁ పెందున్నదె తగఁ జెలియ
కలసెను శ్రీ వేంకటపతి నఁను నిటు
కులికి యితనిఁ బేర్కోనవే చెలియా
(||pallavi||)
ĕvvanigi valaduve sĕliyā
yĕvvalam̐ bilisina nĕṟam̐gave sĕliyā
(||||)
sakkam̐gam̐ bayyadajārina dĕṟam̐gavu
yĕkkaḍa sūseve yiḍu sĕliyā
sĕkkulavĕṁṭam̐ jĕmaḍalu vaḍiyam̐ga
mukkuna nūrbulu muṁcheve sĕliyā
(||||)
jāṟinagŏppunum̐ jakkam̐gam̐ bĕṭṭavu
mīṟevu parāguna neme sĕliya
māṟumāḍalunu mādo nāḍavu
tīṟaga lovĕlim̐ dirigeve sĕliyā
(||||)
vĕlaya haramulu vĕnagagu vesidi
talam̐ pĕṁdunnadĕ tagam̐ jĕliya
kalasĕnu śhrī veṁkaḍabadi nam̐nu niḍu
kuligi yidanim̐ bergonave sĕliyā