ఎవ్వఁడో కాని యెరఁగరాదు కడు
(॥పల్లవి॥)
ఎవ్వఁడో కాని యెరఁగరాదు కడు-
దవ్వులనే వుండు తలంపులోనుండు
(॥ఎవ్వ॥)
ఎడయవు తనరెక్క లెగసిపోలేఁడు
కడు దాఁగుఁగాని దొంగయుఁ గాడు
వడిఁ గిందుపడును సేవకుఁడునుఁ గాఁడు
వెడఁగుగోళ్ళు వెంచు విటుఁడునుఁ గాఁడు
(॥ఎవ్వ॥)
మిగులాఁబొట్టివాఁడు మింటికినిఁ బొడవు
జగడాలు తపసివేషములును
మగువకై పోరాడు మరి విరక్తుఁడును
తగుఁగాపుఁబనులు నెంతయుఁ దెల్లఁదనము
(॥ఎవ్వ॥)
తరుణుల వలపించు తగిలి పై కొనఁడు
తురగముఁ దోలు రౌతునుఁ గాఁడు
తిరువేంకటాద్రిపైఁ దిరుగు నెప్పుడును
పరమమూర్తియై పరగు నీఘనుడు
(||pallavi||)
ĕvvam̐ḍo kāni yĕram̐garādu kaḍu-
davvulane vuṁḍu talaṁpulonuṁḍu
(||ĕvva||)
ĕḍayavu tanarĕkka lĕgasibolem̐ḍu
kaḍu dām̐gum̐gāni dŏṁgayum̐ gāḍu
vaḍim̐ giṁdubaḍunu sevagum̐ḍunum̐ gām̐ḍu
vĕḍam̐gugoḽḽu vĕṁchu viḍum̐ḍunum̐ gām̐ḍu
(||ĕvva||)
migulām̐bŏṭṭivām̐ḍu miṁṭiginim̐ bŏḍavu
jagaḍālu tabasiveṣhamulunu
maguvagai porāḍu mari viraktum̐ḍunu
tagum̐gābum̐banulu nĕṁtayum̐ dĕllam̐danamu
(||ĕvva||)
taruṇula valabiṁchu tagili pai kŏnam̐ḍu
turagamum̐ dolu raudunum̐ gām̐ḍu
tiruveṁkaḍādribaim̐ dirugu nĕppuḍunu
paramamūrdiyai paragu nīghanuḍu