Evvam deṟumgunu mee yedulu

ఎవ్వఁ డెఱుఁగును మీ యేతులు
Language

(॥పల్లవి॥)
ఎవ్వఁ డెఱుఁగును మీ యేతులు
మువ్వంక మెఱసె మీ మురిపెమయ్యా

(॥ఎవ్వ॥)
సొలపుల నిన్నాపె చూచీని
నలుగడ నీవేల నవ్వేవు
తెలియవు మాకు మీ తెఱఁగులు
బలిమిని యెట్టియినా బ్రదుకరయ్యా

(॥ఎవ్వ॥)
విరుల నాపె నిన్ను వేసీని
కెరలి బొమ్మల జంకించేవు
సరిఁ గానము మీచందములు
పరిపరి విధముల బ్రదుకరయ్యా

(॥ఎవ్వ॥)
పెనఁగి ఆపె నిన్నుఁ బిలిచీని
యెనసితివి శ్రీ వేంకటేశ్వరుఁడా
నను నేలితివిటు నయమునను
పనివడి యిట్లానే బ్రదుకరయ్యా

(||pallavi||)
ĕvvam̐ ḍĕṟum̐gunu mī yedulu
muvvaṁka mĕṟasĕ mī muribĕmayyā

(||ĕvva||)
sŏlabula ninnābĕ sūsīni
nalugaḍa nīvela navvevu
tĕliyavu māgu mī tĕṟam̐gulu
balimini yĕṭṭiyinā bradugarayyā

(||ĕvva||)
virula nābĕ ninnu vesīni
kĕrali bŏmmala jaṁkiṁchevu
sarim̐ gānamu mīsaṁdamulu
paribari vidhamula bradugarayyā

(||ĕvva||)
pĕnam̐gi ābĕ ninnum̐ bilisīni
yĕnasidivi śhrī veṁkaḍeśhvarum̐ḍā
nanu nelidiviḍu nayamunanu
panivaḍi yiṭlāne bradugarayyā