Evvadegu mohimchinaa yittive nee semtalu

ఎవ్వతెకు మోహించినా యిట్టివే నీ చేఁతలు
Language

(॥పల్లవి॥)
ఎవ్వతెకు మోహించినా యిట్టివే నీ చేఁతలు
యివ్వల నింతేసి చన విచ్చితివా నీవు

(॥ఎవ్వతె॥)
పట్టంచు దుప్పటము బాగుగాఁ గుచ్చెలవోసి
పెట్టెను వొడ్డాణము బిల్లలనూలు
మెట్టిన చమ్మాళిగెలమీఁదనుండే మాటలాడి
తెట్టఁదెరువున నిదె తేఁకువా నీకు

(॥ఎవ్వతె॥)
రంగుమాణికపుటుంగరములచేయి చెక్కు మోపి
అంగన కైదండతో నొయ్యన వొరగి
ముంగిట నీ మోము చూచి ముసిముసి నవ్వు నవ్వె
అంగడివలపు నీకు నంతప్రియమా

(॥ఎవ్వతె॥)
కమ్మఁబూవులకొప్పుతో కన్నులు వేలవేయుచు
దొమ్మిగా ని న్నింతలోనె తొడికి పట్టి
చెమ్మఁజెమట కుచాలఁ జిందరవందర సేసి
యెమ్మెల శ్రీవేంకటేశ యిందుకు వచ్చితివా

(||pallavi||)
ĕvvadĕgu mohiṁchinā yiṭṭive nī sem̐talu
yivvala niṁtesi sana vichchidivā nīvu

(||ĕvvadĕ||)
paṭṭaṁchu duppaḍamu bāgugām̐ guchchĕlavosi
pĕṭṭĕnu vŏḍḍāṇamu billalanūlu
mĕṭṭina sammāḽigĕlamīm̐danuṁḍe māḍalāḍi
tĕṭṭam̐dĕruvuna nidĕ tem̐kuvā nīgu

(||ĕvvadĕ||)
raṁgumāṇigabuḍuṁgaramulaseyi sĕkku mobi
aṁgana kaidaṁḍado nŏyyana vŏragi
muṁgiḍa nī momu sūsi musimusi navvu navvĕ
aṁgaḍivalabu nīgu naṁtapriyamā

(||ĕvvadĕ||)
kammam̐būvulagŏppudo kannulu velaveyusu
dŏmmigā ni nniṁtalonĕ tŏḍigi paṭṭi
sĕmmam̐jĕmaḍa kusālam̐ jiṁdaravaṁdara sesi
yĕmmĕla śhrīveṁkaḍeśha yiṁdugu vachchidivā