ఎవ్వతెకో యీకె యంటా యెంతేసి తుటారించితి
(॥పల్లవి॥)
ఎవ్వతెకో యీకె యంటా యెంతేసి తుటారించితి
చివ్వన నిందుకుఁగాను చిన్నఁబోకు మిఁకను
(॥ఎవ్వ॥)
ఆపెపై బత్తిగలిగితే నప్పుడే చెప్పవలదా
చేపట్టి నేనిచ్చకము సేకుందును
యీపాటి నీదేవులైతే నింటికిఁ దెచ్చుకోవద్దా
చూపెట్టుకో వొక్కమనసుననుందును
(॥ఎవ్వ॥)
తగులు నీకుఁ గలితే తారుకాణించవలదా
పగటున నేనూ వొడఁబడియుందును
నగినవాఁడవా పొందు నడపఁగ వలదా
తగినట్టు తగవులు తప్పక నేనుందును
(॥ఎవ్వ॥)
చుట్టురికము గలితే నాకుఁ జూపఁగవలదా
వొట్టుకొని సంతోసాన నూరకుందును
నెట్టన శ్రీ వెంకటేశ నేనలమేల్‌మంగను
గట్టిగా నన్నేలితివి కానిమ్మని వుందును
(||pallavi||)
ĕvvadĕgo yīgĕ yaṁṭā yĕṁtesi tuḍāriṁchidi
sivvana niṁdugum̐gānu sinnam̐bogu mim̐kanu
(||ĕvva||)
ābĕbai battigaligide nappuḍe sĕppavaladā
sebaṭṭi nenichchagamu seguṁdunu
yībāḍi nīdevulaide niṁṭigim̐ dĕchchugovaddā
sūbĕṭṭugo vŏkkamanasunanuṁdunu
(||ĕvva||)
tagulu nīgum̐ galide tārugāṇiṁchavaladā
pagaḍuna nenū vŏḍam̐baḍiyuṁdunu
naginavām̐ḍavā pŏṁdu naḍabam̐ga valadā
taginaṭṭu tagavulu tappaga nenuṁdunu
(||ĕvva||)
suṭṭurigamu galide nāgum̐ jūbam̐gavaladā
vŏṭṭugŏni saṁtosāna nūraguṁdunu
nĕṭṭana śhrī vĕṁkaḍeśha nenalamelmaṁganu
gaṭṭigā nannelidivi kānimmani vuṁdunu