ఎవ్వతెకో నేఁడు నిన్ను నింత సేసెను
(॥పల్లవి॥)
ఎవ్వతెకో నేఁడు నిన్ను నింత సేసెను
పువ్వులైన వలపులే పూపఁలు నౌను
(॥॥)
చెవిలోఁ జెప్పిన మాట చిత్తము లోపల నాటీ
వివరింప వినుకలి విరహ మవును
తనివి యదే సారెఁ దలపోయ తలపోయ
కవిసి నివ్వెరగులై కమ్ము కొనును
(॥॥)
కనుఁగవచూపులే కాయముమీఁదఁ బారీ
వెనుకొని కనుకలి విరహ మౌను
తనరి యాకాంక్షలఁ దగులఁగ దగులఁగ
యెనసేటిరతులకు నేఁకట లౌను
(॥॥)
సెలవి నవ్విననవ్వు సేసలై తలకెక్కీ
వెలయుచు నేకశయ్య విరహ మౌను
అలమి శ్రీ వేంకటేశ అట్టె నన్నుఁ గూడితివి
యెలమి సంతోసాల కిరవులౌను
(||pallavi||)
ĕvvadĕgo nem̐ḍu ninnu niṁta sesĕnu
puvvulaina valabule pūbam̐lu naunu
(||||)
sĕvilom̐ jĕppina māḍa sittamu lobala nāḍī
vivariṁpa vinugali viraha mavunu
tanivi yade sārĕm̐ dalaboya talaboya
kavisi nivvĕragulai kammu kŏnunu
(||||)
kanum̐gavasūbule kāyamumīm̐dam̐ bārī
vĕnugŏni kanugali viraha maunu
tanari yāgāṁkṣhalam̐ dagulam̐ga dagulam̐ga
yĕnaseḍiradulagu nem̐kaḍa launu
(||||)
sĕlavi navvinanavvu sesalai talagĕkkī
vĕlayusu negaśhayya viraha maunu
alami śhrī veṁkaḍeśha aṭṭĕ nannum̐ gūḍidivi
yĕlami saṁtosāla kiravulaunu