Evvadedo maadalaade vibudu neevu

ఎవ్వతెతో మాటలాడే విపుడు నీవు
Language

(॥పల్లవి॥)
ఎవ్వతెతో మాటలాడే విపుడు నీవు
జవ్వని నిలుచున్నది చక్కఁజూడవయ్యా

(॥॥)
కలువకన్నుల నిన్నుఁ గసరి
కులుకుఁజన్నుల నిన్నుఁ గొసరి
చెలిఁ బయ్యదకొంగు విసరి
చెలిఁ నీ సేవలు సేసీఁ జిత్తగించవయ్యా

(॥॥)
చిమ్ముల మోహరసము చిలికి
పమ్ముచు ప్రియములెల్లాఁ బలికి
అమ్ముడుసిగ్గులఁ గొంత యలికి
కొమ్మ నీకుఁ దమకించి కొసరీ మెచ్చవయ్యా

(॥॥)
చొక్కపుటాసల నిన్ను సొలసి
మక్కువలు చల్లి చల్లి మలసి
గక్కన శ్రీ వేంకటేశ కలసి
మొక్కీ సంతోసాన నింతి ముదమందవయ్యా

(||pallavi||)
ĕvvadĕdo māḍalāḍe vibuḍu nīvu
javvani nilusunnadi sakkam̐jūḍavayyā

(||||)
kaluvagannula ninnum̐ gasari
kulugum̐jannula ninnum̐ gŏsari
sĕlim̐ bayyadagŏṁgu visari
sĕlim̐ nī sevalu sesīm̐ jittagiṁchavayyā

(||||)
simmula moharasamu siligi
pammusu priyamulĕllām̐ baligi
ammuḍusiggulam̐ gŏṁta yaligi
kŏmma nīgum̐ damagiṁchi kŏsarī mĕchchavayyā

(||||)
sŏkkabuḍāsala ninnu sŏlasi
makkuvalu salli salli malasi
gakkana śhrī veṁkaḍeśha kalasi
mŏkkī saṁtosāna niṁti mudamaṁdavayyā