ఎవ్వతె యెక్కుడు నీకు నిద్దరిలోన
(॥పల్లవి॥)
ఎవ్వతె యెక్కుడు నీకు నిద్దరిలోన
యివ్వల నవ్వలఁ దాము ఇద్దరు నున్నారు
(॥ఎవ్వ॥)
మన రంజిలఁజేసి మాటలు నీతో నాడి
చనవు చేసుకో నాపె చదురాలు
వెనక నొక్కతి వచ్చి వేడుకలు నీకు నించి
పెనఁగులాటల మోవి పిప్పిసేసె నిపుడు
(॥ఎవ్వ॥)
యిచ్చకములెల్ల జూపి యెదుటనే నిలుచుండి
పచ్చిచేసె నిన్ను నాకె పంతగత్తె
హెచ్చి నిన్ను దఱవాత నీపె వచ్చి బుజ్జగించి
తచ్చితచ్చి కమ్మటినిఁ దమకించె నిపుడు
(॥ఎవ్వ ॥)
సేవలెల్లా నీకుఁ జేసి శ్రీవేంకటేశ్వర కూడ
నీ వద్దనే వున్న దాకె నెరవాది
యీవల నన్నేలితివి యిదెఱిఁగి తోడియాపె
తావులనే నెలకొని తనిపెఁ దానిపుడు
(||pallavi||)
ĕvvadĕ yĕkkuḍu nīgu niddarilona
yivvala navvalam̐ dāmu iddaru nunnāru
(||ĕvva||)
mana raṁjilam̐jesi māḍalu nīdo nāḍi
sanavu sesugo nābĕ sadurālu
vĕnaga nŏkkadi vachchi veḍugalu nīgu niṁchi
pĕnam̐gulāḍala movi pippisesĕ nibuḍu
(||ĕvva||)
yichchagamulĕlla jūbi yĕduḍane nilusuṁḍi
pachchisesĕ ninnu nāgĕ paṁtagattĕ
hĕchchi ninnu daṟavāda nībĕ vachchi bujjagiṁchi
tachchidachchi kammaḍinim̐ damagiṁchĕ nibuḍu
(||ĕvva ||)
sevalĕllā nīgum̐ jesi śhrīveṁkaḍeśhvara kūḍa
nī vaddane vunna dāgĕ nĕravādi
yīvala nannelidivi yidĕṟim̐gi toḍiyābĕ
tāvulane nĕlagŏni tanibĕm̐ dānibuḍu