ఎవ్వతైనా వలచును యిటువంటి పనులకు
(॥పల్లవి॥)
ఎవ్వతైనా వలచును యిటువంటి పనులకు
రవ్వపడిన చేఁతల రతి కెక్కితివిరా
(॥ఎవ్వ॥)
సొలపులాడి మనసు సోదించి చూచితి
చులుకఁగాఁ బెనఁగి నేఁ జూచితిని
యెలమి నందుకులోన ఇచ్చకమే సేసేవు
చలివాసె నన్నిటాను జాణఁడ వౌదువురా
(॥ఎవ్వ॥)
కప్పిన నీచేఁతలు సంగడి జూపి చూచితి
చొప్పులెత్తి నవ్వు నవ్వి చూచితివి
వొప్పుకొని అందుకెల్లా నొడఁబడఁ జెప్పేవు
తప్పని బొంకనియట్టిదంట వౌదువురా
(॥ఎవ్వ॥)
మిక్కుటపురతులను మెప్పించి చూచితి
చొక్కించి గోరగీరి చూచితివి
యొక్కడాను మోసపోవు యిన్నిటా నన్నేలితివి
యెక్కువైన శ్రీవేంకటేశుఁడ వౌదువురా
(||pallavi||)
ĕvvadainā valasunu yiḍuvaṁṭi panulagu
ravvabaḍina sem̐tala radi kĕkkidivirā
(||ĕvva||)
sŏlabulāḍi manasu sodiṁchi sūsidi
sulugam̐gām̐ bĕnam̐gi nem̐ jūsidini
yĕlami naṁdugulona ichchagame sesevu
salivāsĕ nanniḍānu jāṇam̐ḍa vauduvurā
(||ĕvva||)
kappina nīsem̐talu saṁgaḍi jūbi sūsidi
sŏppulĕtti navvu navvi sūsidivi
vŏppugŏni aṁdugĕllā nŏḍam̐baḍam̐ jĕppevu
tappani bŏṁkaniyaṭṭidaṁṭa vauduvurā
(||ĕvva||)
mikkuḍaburadulanu mĕppiṁchi sūsidi
sŏkkiṁchi goragīri sūsidivi
yŏkkaḍānu mosabovu yinniḍā nannelidivi
yĕkkuvaina śhrīveṁkaḍeśhum̐ḍa vauduvurā