ఎవ్వ రింత సేసిరమ్మ యీతఁడే కాక
(॥పల్లవి॥)
ఎవ్వ రింత సేసిరమ్మ యీతఁడే కాక
రవ్వఁ జూడఁ బోయి వీని రతికి లోనైతిమే
(॥ఎవ్వ॥)
కొట్టేటివుట్టును కోలలసాములును
వెట్టినవ్వు లేడవే వీదివీదులా
తిట్టరాదు పట్టరాదు దిమ్మరీఁ డేశోదపట్టి
యిట్టిసలిగెలు తన కేల వచ్చెనే
(॥ఎవ్వ॥)
పారేట్టిరువులు బాలులమూఁకలు
వేరేరొద లేడవే వీదివీదులా
వారము వజ్జము లేదు వంచుక పాలువెన్నలు
వారవట్టి యారగించీ వాఁడే వాఁడే కదవే
(॥ఎవ్వ॥)
లాసేటిలాగులును లంగించేయెగరులు
వేసేటిగంతు లెవ్వరే వీదివీదులా
ఆసల శ్రీ వేంకటేశుఁ డంతటా కలయఁ గొని
సేసి నుట్లపండుగ చెల్లుబడిగాను
(||pallavi||)
ĕvva riṁta sesiramma yīdam̐ḍe kāga
ravvam̐ jūḍam̐ boyi vīni radigi lonaidime
(||ĕvva||)
kŏṭṭeḍivuṭṭunu kolalasāmulunu
vĕṭṭinavvu leḍave vīdivīdulā
tiṭṭarādu paṭṭarādu dimmarīm̐ ḍeśhodabaṭṭi
yiṭṭisaligĕlu tana kela vachchĕne
(||ĕvva||)
pāreṭṭiruvulu bālulamūm̐kalu
vererŏda leḍave vīdivīdulā
vāramu vajjamu ledu vaṁchuga pāluvĕnnalu
vāravaṭṭi yāragiṁchī vām̐ḍe vām̐ḍe kadave
(||ĕvva||)
lāseḍilāgulunu laṁgiṁcheyĕgarulu
veseḍigaṁtu lĕvvare vīdivīdulā
āsala śhrī veṁkaḍeśhum̐ ḍaṁtaḍā kalayam̐ gŏni
sesi nuṭlabaṁḍuga sĕllubaḍigānu