Evva revva remaninaa nemaayane

ఎవ్వ రెవ్వ రేమనినా నేమాయనే
Language

(॥పల్లవి॥)
ఎవ్వ రెవ్వ రేమనినా నేమాయనే
పువ్వు బువ్వే కాయ గాయే పూప దప్పీనా

(॥ఎవ్వ॥)
కొండలకు మారుకొన్న కుచములు పైఁడి
కుండలంటే కడుంగడు కొంచము గాదా
అండ నుండే చెలు లెల్లా నంతర మెఱుఁగకున్న
నుండరమ్మా వాని కేమి వొచ్చ మయ్యీనా

(॥ఎవ్వ॥)
వొద్దికఁ జందురుకంటే నుదుటైన నెమ్మోము
అద్దమంటా నాడుకొంటే నందము తానా
పొద్దువోక చెలు లెందుఁ బోలిచిన తమలోని
సుద్దు లింతే కాక వానిసొంపు దప్పీనా

(॥ఎవ్వ॥)
పుత్తడిబొమ్మవంటి పొలిఁతి నిందరు జూచి
చిత్తరువు పతిమంటే జిగి దప్పీనా
చిత్తగించి చెలిఁ గూడే శ్రీవేంకటపతి
గుత్తపుసింగారాలు కొత్త లయ్యీనా

(||pallavi||)
ĕvva rĕvva remaninā nemāyane
puvvu buvve kāya gāye pūba dappīnā

(||ĕvva||)
kŏṁḍalagu mārugŏnna kusamulu paim̐ḍi
kuṁḍalaṁṭe kaḍuṁgaḍu kŏṁchamu gādā
aṁḍa nuṁḍe sĕlu lĕllā naṁtara mĕṟum̐gagunna
nuṁḍarammā vāni kemi vŏchcha mayyīnā

(||ĕvva||)
vŏddigam̐ jaṁdurugaṁṭe nuduḍaina nĕmmomu
addamaṁṭā nāḍugŏṁṭe naṁdamu tānā
pŏdduvoga sĕlu lĕṁdum̐ bolisina tamaloni
suddu liṁte kāga vānisŏṁpu dappīnā

(||ĕvva||)
puttaḍibŏmmavaṁṭi pŏlim̐ti niṁdaru jūsi
sittaruvu padimaṁṭe jigi dappīnā
sittagiṁchi sĕlim̐ gūḍe śhrīveṁkaḍabadi
guttabusiṁgārālu kŏtta layyīnā