Evva rettumdina nemi yemainaa nemi

ఎవ్వ రెట్టుండిన నేమి యేమైనా నేమి
Language

(॥పల్లవి॥)
ఎవ్వ రెట్టుండిన నేమి యేమైనా నేమి
నవ్వుచుఁ దనసుకము నడచీఁ జాలదా

(॥ఎవ్వ॥)
వోలిసీనోల్లనిమాట కూఁకోనఁగవలెనా
చెలఁగి మోమెగరవేసేది చాలదా
తలఁపు నాకెట్టుండినా తనకేమి వద్దనుండి
వలసినపనులెల్ల వంతుసేసేఁ జాలదా

(॥ఎవ్వ॥)
ముట్టీముట్టనిపనికి మోము చూడవలెనా
నెట్టన నదానఁ జూచేనీడ చాలదా
దట్టమై నేఁ జిన్నఁ బోతే తనకేమే పానుపుపై
వెట్టదీర పాదమొత్తి వేగించేఁ జాలదా

(॥ఎవ్వ॥)
కూడీఁగూడనందుకును కోసరులు వలెనా
వోడక మేనోప్పగించివుంటేఁ జాలదా
యీడనే శ్రీవేంకటేశుఁ డెట్టయిననేమి నన్ను
జోడై కూడఁగాఁ జోక్కితినేఁ జాలదా

(||pallavi||)
ĕvva rĕṭṭuṁḍina nemi yemainā nemi
navvusum̐ danasugamu naḍasīm̐ jāladā

(||ĕvva||)
volisīnollanimāḍa kūm̐konam̐gavalĕnā
sĕlam̐gi momĕgaravesedi sāladā
talam̐pu nāgĕṭṭuṁḍinā tanagemi vaddanuṁḍi
valasinabanulĕlla vaṁtusesem̐ jāladā

(||ĕvva||)
muṭṭīmuṭṭanibanigi momu sūḍavalĕnā
nĕṭṭana nadānam̐ jūsenīḍa sāladā
daṭṭamai nem̐ jinnam̐ bode tanageme pānububai
vĕṭṭadīra pādamŏtti vegiṁchem̐ jāladā

(||ĕvva||)
kūḍīm̐gūḍanaṁdugunu kosarulu valĕnā
voḍaga menoppagiṁchivuṁṭem̐ jāladā
yīḍane śhrīveṁkaḍeśhum̐ ḍĕṭṭayinanemi nannu
joḍai kūḍam̐gām̐ jokkidinem̐ jāladā