ఎవ్వ రెట్టెనై నననీ యియ్యకోలు నీకు నాకు
(॥పల్లవి॥)
ఎవ్వ రెట్టెనై నననీ యియ్యకోలు నీకు నాకు
రవ్వలుగా నిన్ను నింత రతి కెక్కించితిని
(॥ఎవ్వ॥)
సారెసారె నాతో నవ్వేచనవున నే నిన్ను
వోరి యని యంటిని నొడి వట్టితి
మారు లేక నీవు నన్ను మన్నించి మందువుగాన
గోరుకొన దాఁకించితి కూరిమి చల్లితిని
(॥ఎవ్వ॥)
మాటలు నీ వాడేటిమందెమేళముననే
కూటమికిఁ బెనఁగితి కొసరితిని
నాటఁ జూచిననీచూపు ననిచినందువల్లనే
యీటు వెట్టుక నీమోవి యెంగిలి సేసితిని
(॥ఎవ్వ॥)
కాయము నా కొప్పగించి కాఁగిలించుకొనఁగానే
చాయల నిన్నుఁదిట్టితి జంకించితిని
ఆయపు శ్రీవేంకటేశ అలమేల్మంగను నేను
పాయకుండఁగానే నిన్ను కంతాన మించితిని
(||pallavi||)
ĕvva rĕṭṭĕnai nananī yiyyagolu nīgu nāgu
ravvalugā ninnu niṁta radi kĕkkiṁchidini
(||ĕvva||)
sārĕsārĕ nādo navvesanavuna ne ninnu
vori yani yaṁṭini nŏḍi vaṭṭidi
māru lega nīvu nannu manniṁchi maṁduvugāna
gorugŏna dām̐kiṁchidi kūrimi sallidini
(||ĕvva||)
māḍalu nī vāḍeḍimaṁdĕmeḽamunane
kūḍamigim̐ bĕnam̐gidi kŏsaridini
nāḍam̐ jūsinanīsūbu nanisinaṁduvallane
yīḍu vĕṭṭuga nīmovi yĕṁgili sesidini
(||ĕvva||)
kāyamu nā kŏppagiṁchi kām̐giliṁchugŏnam̐gāne
sāyala ninnum̐diṭṭidi jaṁkiṁchidini
āyabu śhrīveṁkaḍeśha alamelmaṁganu nenu
pāyaguṁḍam̐gāne ninnu kaṁtāna miṁchidini