ఎవ్వ రెట్టయినా నుండనీ ఇదివో నేను
(॥పల్లవి॥)
ఎవ్వ రెట్టయినా నుండనీ ఇదివో నేను
నవ్వుతా నీసేవ సేతు నడుమ నేను
(॥॥)
మనసున నొకమాట మఱఁగున నొకమాఁట
యెనసి నే నయములు యెఱఁగ నేను
వనితనై నీమీఁదివలుపే గతియని
తనివోక బదికేటిదానను నేను
(॥॥)
వొలిసితే నొకటియు నొల్లకుంటే నొకటియు
చలివేఁడివేసాలు జరప నేను
కలికితనాన నీతో కాఁపురమే గతియని
తలఁచి పొందులు సేసేదానను నేను
(॥॥)
వొక్కపరి యిచ్చకము వొక్కపరి మచ్చరము
యిక్కడా నక్కడ యెలయించను నేను
గక్కన శ్రీ వేంకటేశ కలసితి విటు నన్ను
మక్కువ నిటువలెనే మరుగుదు నేను
(||pallavi||)
ĕvva rĕṭṭayinā nuṁḍanī idivo nenu
navvudā nīseva sedu naḍuma nenu
(||||)
manasuna nŏgamāḍa maṟam̐guna nŏgamām̐ṭa
yĕnasi ne nayamulu yĕṟam̐ga nenu
vanidanai nīmīm̐divalube gadiyani
tanivoga badigeḍidānanu nenu
(||||)
vŏliside nŏgaḍiyu nŏllaguṁṭe nŏgaḍiyu
salivem̐ḍivesālu jaraba nenu
kaligidanāna nīdo kām̐purame gadiyani
talam̐si pŏṁdulu sesedānanu nenu
(||||)
vŏkkabari yichchagamu vŏkkabari machcharamu
yikkaḍā nakkaḍa yĕlayiṁchanu nenu
gakkana śhrī veṁkaḍeśha kalasidi viḍu nannu
makkuva niḍuvalĕne marugudu nenu