Evva retlumdiremi yimti dikke aadavayyaa

ఎవ్వ రెట్లుండిరేమి యింతి దిక్కే ఆడవయ్యా
Language

(॥పల్లవి॥)
ఎవ్వ రెట్లుండిరేమి యింతి దిక్కే ఆడవయ్యా
నివ్వటిల్ల నానవెట్టీ నేరుపుతో నదివో

(॥ఎవ్వ॥)
తఱినాపె గెల్చుదాఁకాఁ దగవులు చెప్పవయ్యా
గుఱిగాఁగ నిన్నే యాపె కోరి వచ్చెను
యెఱుకతో నీదాక్షిణ్య మిందులోనే వున్నదయ్య
మొఱఁగును నట్టే నీమోము చూచీ నదివో

(॥ఎవ్వ॥)
అతివకు సంతోసమౌనట్టే మాటాడవయ్య
కొతుకక సాకిరులు గోరీ నిన్నే
తతితోడ నాపెనే పెద్దరికము సేయవయ్య
అతిశయముగ నిన్నే ఆసపడి నదివో

(॥ఎవ్వ॥)
అంగన గెలిచితి వనవయ్యవొక్కమాఁటే
బెంగవలెఁ గోరివచ్చి పెనఁగీ నీతో
సంగతి శ్రీవేంకటేశసరిగాఁ జేసితివయ్య
కొంగువట్టి మమ్మిద్దరిఁ గూడితి విల్లిదివో

(||pallavi||)
ĕvva rĕṭluṁḍiremi yiṁti dikke āḍavayyā
nivvaḍilla nānavĕṭṭī nerubudo nadivo

(||ĕvva||)
taṟinābĕ gĕlsudām̐kām̐ dagavulu sĕppavayyā
guṟigām̐ga ninne yābĕ kori vachchĕnu
yĕṟugado nīdākṣhiṇya miṁdulone vunnadayya
mŏṟam̐gunu naṭṭe nīmomu sūsī nadivo

(||ĕvva||)
adivagu saṁtosamaunaṭṭe māḍāḍavayya
kŏdugaga sāgirulu gorī ninne
tadidoḍa nābĕne pĕddarigamu seyavayya
adiśhayamuga ninne āsabaḍi nadivo

(||ĕvva||)
aṁgana gĕlisidi vanavayyavŏkkamām̐ṭe
bĕṁgavalĕm̐ gorivachchi pĕnam̐gī nīdo
saṁgadi śhrīveṁkaḍeśhasarigām̐ jesidivayya
kŏṁguvaṭṭi mammiddarim̐ gūḍidi villidivo