Evva reṟumgudurayya iduvamti nee manasu

ఎవ్వ రెఱుఁగుదురయ్య ఇటువంటి నీ మనసు
Language

(॥పల్లవి॥)
ఎవ్వ రెఱుఁగుదురయ్య ఇటువంటి నీ మనసు
పువ్వువంటి యాఁటదాన బుద్దిచెప్పవయ్యా

(॥॥)
ఇందమని విడెమిచ్చే విప్పుడు నీవు
అందుకొంటి నాసకత్తెనని యందునో
పందెము వేసీఁ జెయిపట్టుమనేవు
సందడిఁ జేయొగ్గితేను సాహసురా లందువో

(॥॥)
పైకొని పాదములు నాపై వేసేవు
చేకొని యొత్తఁగ నెంతచిత్తిణందువో
ఆకుమడిచిమ్మనుచు నానవెట్టేవు
యీకడ నియ్యకొంటే నిదెంత లాచీనందువో

(॥॥)
గుట్టుతోడఁ గాఁగిలించుకొమ్మనేవు
గట్టిచన్నులు నాఁటించఁగా నేమందువో
యిట్టె శ్రీ వేంకటేశ నన్నేలితివి
నెట్టన మొక్కఁగా నెంతనేరుపతి నందువో

(||pallavi||)
ĕvva rĕṟum̐gudurayya iḍuvaṁṭi nī manasu
puvvuvaṁṭi yām̐ṭadāna buddisĕppavayyā

(||||)
iṁdamani viḍĕmichche vippuḍu nīvu
aṁdugŏṁṭi nāsagattĕnani yaṁduno
paṁdĕmu vesīm̐ jĕyibaṭṭumanevu
saṁdaḍim̐ jeyŏggidenu sāhasurā laṁduvo

(||||)
paigŏni pādamulu nābai vesevu
segŏni yŏttam̐ga nĕṁtasittiṇaṁduvo
āgumaḍisimmanusu nānavĕṭṭevu
yīgaḍa niyyagŏṁṭe nidĕṁta lāsīnaṁduvo

(||||)
guṭṭudoḍam̐ gām̐giliṁchugŏmmanevu
gaṭṭisannulu nām̐ṭiṁcham̐gā nemaṁduvo
yiṭṭĕ śhrī veṁkaḍeśha nannelidivi
nĕṭṭana mŏkkam̐gā nĕṁtanerubadi naṁduvo