Evva remiseduru yekkadi kekku maamaamta

ఎవ్వ రేమిసేతురు యెక్కడి కెక్కు మామాఁట
Language

(॥పల్లవి॥)
ఎవ్వ రేమిసేతురు యెక్కడి కెక్కు మామాఁట
యివ్వల నిచ్చాడు వారి కింతే పో దోసము

(॥ఎవ్వ॥)
పట్టరాదు ముట్టరాదు పడఁతిచిత్తముకాక
పట్టరాదు నీమనసు పతివి నీవు
వొట్టినమోహ మామెకు వొలసీనొల్లమి నీకు
యిట్టేసేసినమరుని కింతేపో దోసము

(॥ఎవ్వ॥)
చెప్పరాదు చూపరాదు చెలియతమకములు
చెప్పరాదు మారుమాట చెంగట నీకు
ముప్పిరిచింత యాకెకు ముదము నీకుఁ జేసిన -
యిప్పటిపూవుబాణాల దింతేపో దోసము

(॥ఎవ్వ॥)
ముయ్యరాదు తియ్యరాదు ముదితరెప్పలచూపు
ముయ్యరాదు నీకు నిఁక మోవికెంపులు
నెయ్యము శ్రీవేంకటేశ నెలఁతఁ గూడి తింతలో
ఇయ్యెడ మెచ్చనివారి కింతేపో దోసము

(||pallavi||)
ĕvva remiseduru yĕkkaḍi kĕkku māmām̐ṭa
yivvala nichchāḍu vāri kiṁte po dosamu

(||ĕvva||)
paṭṭarādu muṭṭarādu paḍam̐tisittamugāga
paṭṭarādu nīmanasu padivi nīvu
vŏṭṭinamoha māmĕgu vŏlasīnŏllami nīgu
yiṭṭesesinamaruni kiṁtebo dosamu

(||ĕvva||)
sĕpparādu sūbarādu sĕliyadamagamulu
sĕpparādu mārumāḍa sĕṁgaḍa nīgu
muppirisiṁta yāgĕgu mudamu nīgum̐ jesina -
yippaḍibūvubāṇāla diṁtebo dosamu

(||ĕvva||)
muyyarādu tiyyarādu mudidarĕppalasūbu
muyyarādu nīgu nim̐ka movigĕṁpulu
nĕyyamu śhrīveṁkaḍeśha nĕlam̐tam̐ gūḍi tiṁtalo
iyyĕḍa mĕchchanivāri kiṁtebo dosamu