ఎవ్వ రేమి చెప్పిరె యింతలోననే
(॥పల్లవి॥)
ఎవ్వ రేమి చెప్పిరె యింతలోననే
నివ్వటిల్ల వింత లెల్ల నేరుచుకొంటివా
(॥ఎవ్వ లేమి॥)
మోము చూచి నవ్వఁగానె మోనానఁ దల వంచేవు
యేమిటికే కోపము నీ కెన్నఁడు లేమి
కామించి పిలిపించి కడసారె నలిగేవు
నేమమున నివి గొన్ని నేరుచుకొంటివా
(॥ఎవ్వ రేమి॥)
దగ్గరి నేఁ గూచుంటె తగ లేచి నిలిచేవు
సిగ్గు గొంత జిగి గొంతఁ జిలికే వేమే
అగ్గలపుఁ బ్రేమ చల్లి అంతలోఁ బిరి తీసేవు
నిగ్గులు నీడలు కొన్ని నేరుచుకొంటివా
(॥ఎవ్వ రేమి॥)
కాఁగిట నే నించఁగాను కన్నులు మూసుకొనేవు
మాఁగఁ బెట్టేవు వలపు మతిలో మేలే
పాఁగిన శ్రీవెంకటపతి నన్నుఁ గూడితవి
నీఁగనిరతులు నేఁడు నేరుచుకొంటివా
(||pallavi||)
ĕvva remi sĕppirĕ yiṁtalonane
nivvaḍilla viṁta lĕlla nerusugŏṁṭivā
(||ĕvva lemi||)
momu sūsi navvam̐gānĕ monānam̐ dala vaṁchevu
yemiḍige kobamu nī kĕnnam̐ḍu lemi
kāmiṁchi pilibiṁchi kaḍasārĕ naligevu
nemamuna nivi gŏnni nerusugŏṁṭivā
(||ĕvva remi||)
daggari nem̐ gūsuṁṭĕ taga lesi nilisevu
siggu gŏṁta jigi gŏṁtam̐ jilige veme
aggalabum̐ brema salli aṁtalom̐ biri tīsevu
niggulu nīḍalu kŏnni nerusugŏṁṭivā
(||ĕvva remi||)
kām̐giḍa ne niṁcham̐gānu kannulu mūsugŏnevu
mām̐gam̐ bĕṭṭevu valabu madilo mele
pām̐gina śhrīvĕṁkaḍabadi nannum̐ gūḍidavi
nīm̐ganiradulu nem̐ḍu nerusugŏṁṭivā