Evva remi saadhimche revvaru ne meṟimgeru

ఎవ్వ రేమి సాధించే రెవ్వరు నే మెఱిఁగేరు
Language

(॥పల్లవి॥)
ఎవ్వ రేమి సాధించే రెవ్వరు నే మెఱిఁగేరు
అవ్వల నివ్వల శ్రీహరియే దైవము

(॥ఎవ్వ॥)
జగములోపల హరి సాత్విక దైవమని
భృగువె సోదించినాఁడు పృధివిఁ దొల్లె
ముగురువేలుపులలో మొరవెట్టిరితనికె
జిగి మించ దేవతలు క్షీరాబ్ధికాడనే

(॥ఎవ్వ॥)
ధరఁ గాశిలోన హరి తారకబ్రహ్మమని
హరుఁడే బోధించఁ జొచ్చె నందరికిని
అరుదుగా రామనామ మతని పట్టపురాణి
గిరిసుత పార్వతి కీర్తింపఁ దొడఁగే

(॥ఎవ్వ॥)
అదిగో శ్రీ వేంకటాద్రి హరి పరతత్త్వమని
యెదుటనె బ్రహ్మ పుట్టె యితని నాభిని
యిదిగో మన మిందర మతనినే కొల్చి
బ్రదుకుద మిటు రారో ప్రాణులాల మీరు

(||pallavi||)
ĕvva remi sādhiṁche rĕvvaru ne mĕṟim̐geru
avvala nivvala śhrīhariye daivamu

(||ĕvva||)
jagamulobala hari sātviga daivamani
bhṛguvĕ sodiṁchinām̐ḍu pṛdhivim̐ dŏllĕ
muguruvelubulalo mŏravĕṭṭiridanigĕ
jigi miṁcha devadalu kṣhīrābdhigāḍane

(||ĕvva||)
dharam̐ gāśhilona hari tāragabrahmamani
harum̐ḍe bodhiṁcham̐ jŏchchĕ naṁdarigini
arudugā rāmanāma madani paṭṭaburāṇi
girisuda pārvadi kīrdiṁpam̐ dŏḍam̐ge

(||ĕvva||)
adigo śhrī veṁkaḍādri hari paradattvamani
yĕduḍanĕ brahma puṭṭĕ yidani nābhini
yidigo mana miṁdara madanine kŏlsi
braduguda miḍu rāro prāṇulāla mīru