Evi neṟumganivaari nemta kemta sesevu

ఏవి నెఱుఁగనివారి నెంత కెంత సేసేవు
Language

(॥పల్లవి॥)
ఏవి నెఱుఁగనివారి నెంత కెంత సేసేవు
నేమ మేమి దప్పినాను నీది గాదా దోసము

(॥ఏవి॥)
చెలియ మాటున నుండి సిగ్గువడియున్న యింతి
అలరి రమ్మని నీపై నానవెట్టేవు
మొలకవయసుతోడి ముద్దరా లే మెఱుఁగును
నెలకొని రా దిఁక నీది గాదా దోసము

(॥ఏవి॥)
మగువతల వంచుక మంచముపై నుండఁగాను
దిగువ నిలుచుండి బోధించ వచ్చేవు
చిగురుఁగాఁకలతోడిచిన్నది యే మెఱుఁగును
నిగిడి యేమి సేసినా నీది గాదా దోసము

(॥ఏవి॥)
మాటలాడఁ గొంకి సతి మౌనముతో నుండఁగాను
తేటల నాకె నీపయికిఁ దీసుకొంటివి
గాటపు శ్రీవేంకటేశ కాలు దాఁకుఁ జేయి దాఁకు
నీటునఁ గిందుపడితే నీది గాదా దోసము

(||pallavi||)
evi nĕṟum̐ganivāri nĕṁta kĕṁta sesevu
nema memi dappinānu nīdi gādā dosamu

(||evi||)
sĕliya māḍuna nuṁḍi sigguvaḍiyunna yiṁti
alari rammani nībai nānavĕṭṭevu
mŏlagavayasudoḍi muddarā le mĕṟum̐gunu
nĕlagŏni rā dim̐ka nīdi gādā dosamu

(||evi||)
maguvadala vaṁchuga maṁchamubai nuṁḍam̐gānu
diguva nilusuṁḍi bodhiṁcha vachchevu
sigurum̐gām̐kaladoḍisinnadi ye mĕṟum̐gunu
nigiḍi yemi sesinā nīdi gādā dosamu

(||evi||)
māḍalāḍam̐ gŏṁki sadi maunamudo nuṁḍam̐gānu
teḍala nāgĕ nībayigim̐ dīsugŏṁṭivi
gāḍabu śhrīveṁkaḍeśha kālu dām̐kum̐ jeyi dām̐ku
nīḍunam̐ giṁdubaḍide nīdi gādā dosamu