ఏవీ(దీ?) నీయందుఁ జూపు ఇందులో నొకటైన
(॥పల్లవి॥)
ఏవీ(దీ?) నీయందుఁ జూపు ఇందులో నొకటైన
ఆదిగొని నిన్ను మెచ్చే నప్పుడే నేను
(॥ఏలీ॥)
తప్పక వలపులెల్ల తలకెక్కినప్పుడు
కప్పురమే నోటికి కారమై తోఁచు
వుప్పటిల్లు మదనాగ్ని వొడల రేఁగినపుడు
అప్పటి పన్నీరు వుడుకై తోఁచును
(॥ఏలీ॥)
కందునైన కాంక్షలు కన్నులఁ దొట్టినప్పుడు
గందమే బాసటమై కమ్ముకొనును
మందలించి తమకము మనసునిండినప్పుడు
విందుల నమృతమైనా వెగటై తోఁచును
(॥ఏలీ॥)
చిగిరింపుఁజింత చేయిచెక్కిట మోపినపుడు
మొగిఁ గొప్పువిరులెల్లా మెనలై నిక్కు
నిగిడి శ్రీవేంకటేశ నీవు నిన్నుఁ గూడితివి
నగిన నగవులెల్లా ననుపులై మించును
(||pallavi||)
evī(dī?) nīyaṁdum̐ jūbu iṁdulo nŏgaḍaina
ādigŏni ninnu mĕchche nappuḍe nenu
(||elī||)
tappaga valabulĕlla talagĕkkinappuḍu
kappurame noḍigi kāramai tom̐su
vuppaḍillu madanāgni vŏḍala rem̐ginabuḍu
appaḍi pannīru vuḍugai tom̐sunu
(||elī||)
kaṁdunaina kāṁkṣhalu kannulam̐ dŏṭṭinappuḍu
gaṁdame bāsaḍamai kammugŏnunu
maṁdaliṁchi tamagamu manasuniṁḍinappuḍu
viṁdula namṛtamainā vĕgaḍai tom̐sunu
(||elī||)
sigiriṁpum̐jiṁta seyisĕkkiḍa mobinabuḍu
mŏgim̐ gŏppuvirulĕllā mĕnalai nikku
nigiḍi śhrīveṁkaḍeśha nīvu ninnum̐ gūḍidivi
nagina nagavulĕllā nanubulai miṁchunu