ఏవీ నుపాయాలుగావు యెక్కువ భక్తేకాని
(॥పల్లవి॥)
ఏవీ నుపాయాలుగావు యెక్కువ భక్తేకాని
దావతిఁ బడక యిది దక్కితే సులభము
(॥ఏవీ॥)
ముంటిపై సుఖమందుట ముక్కున నూరుపువట్టి
దంటవాయువు గెలువఁ దలచేదెల్లా
వెంటిక వట్టుకపోయి వెఁస గొండ వాఁకుట
వెంటఁ గర్మమార్గమున విష్ణుని సాధించుట
(॥ఏవీ॥)
యేనుగుతోఁ బెనఁగుట యిల నిరాహారియై
కానని పంచేంద్రియాలఁ గట్టఁబోవుట
నానించినుపగుగిళ్ళు నములుట బలిమిని
ధ్యానించి మనఁసుఁబట్టి దైవము సాధించుట
(॥ఏవీ॥)
దప్పికి నెండమావులు దాగ దగ్గరఁబోవుట
తప్పుఁ జదువులలోఁ దత్త్వము నెంచుట
పిప్పి చవి యడుగుట పెక్కు దైవాలఁ గొలిచి
కప్పిన శ్రీవేంకటేశుకరుణ సాధించుట
(||pallavi||)
evī nubāyālugāvu yĕkkuva bhaktegāni
dāvadim̐ baḍaga yidi dakkide sulabhamu
(||evī||)
muṁṭibai sukhamaṁduḍa mukkuna nūrubuvaṭṭi
daṁṭavāyuvu gĕluvam̐ dalasedĕllā
vĕṁṭiga vaṭṭugaboyi vĕm̐sa gŏṁḍa vām̐kuḍa
vĕṁṭam̐ garmamārgamuna viṣhṇuni sādhiṁchuḍa
(||evī||)
yenugudom̐ bĕnam̐guḍa yila nirāhāriyai
kānani paṁcheṁdriyālam̐ gaṭṭam̐bovuḍa
nāniṁchinubagugiḽḽu namuluḍa balimini
dhyāniṁchi manam̐sum̐baṭṭi daivamu sādhiṁchuḍa
(||evī||)
dappigi nĕṁḍamāvulu dāga daggaram̐bovuḍa
tappum̐ jaduvulalom̐ dattvamu nĕṁchuḍa
pippi savi yaḍuguḍa pĕkku daivālam̐ gŏlisi
kappina śhrīveṁkaḍeśhugaruṇa sādhiṁchuḍa